జగన్ పై ప్రజలే దాడి చేస్తారు.. ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్స్ రచ్చ...
posted on Sep 29, 2021 @ 11:04AM
ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు. కాని ఆయనే సీఎంను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడారు.. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిపై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడటం సంచలనంగా మారింది. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ గా మారి రచ్చ రచ్చవుతోంది..
అసలు ఆయన ఈ కామెంట్ ఎందుకు చేశారో తెలుసా.. ఆయన కావాలని అన లేదు... ఏదో మాట్లాడబోతూ అలా నోరు జారారు.. అయితే అసలే సోషల్ మీడియా ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. చిన్న బిట్ దొరికినా అటాడేసుకుంటారు. అలాంటిది సీఎంపై ప్రజలే దాడి చేస్తారని ఉప ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటారా... తెగ వైరల్ చేస్తున్నారు..
అసలు విషయానికి వస్తే.. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడింది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్ రచ్చ సాగుతోంది. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పీకే మాట్లాడటంతో.. ఆయనకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పవన్ ను టార్గెట్ చేయడంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేశారు. పవన్ పై ప్రజలే దాడి చేస్తారని అనబోయి.. నోరు జారారు. జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించారు.ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది.
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడిన మాటలను జనసేన, టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. జగన్ పై ప్రజలు దాడి చేయడం ఖాయమని, వైసీపీ నేతలే ఈ విషయం చెబుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.