ఏసీలు ఆపేయాలట.. ఇదేమి ఖర్మ జగనన్న..!
posted on Oct 10, 2021 @ 2:18PM
ఆర్థిక కష్టాలు చాలవన్నట్టు.. కరెంట్ కష్టాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. ఓవైపు ఫుల్లుగా వానలు పడుతున్నా.. మరోవైపు ఎండాకాలం మాదిరి కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. సమ్మర్‌లో అంటే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది.. జల విద్యుత్ ఉత్పాదన తగ్గుతుంది కాబట్టి.. పవర్ కట్స్ ఉంటాయంటే అర్థం ఉంది. మరి, మునుపెన్నడూ లేనట్టు అక్టోబర్‌లో ఈ కరెంట్ కోతలేంటి జగనన్న అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్ సర్కారు చెబుతున్న కారణం.. బొగ్గు కొరత. బొగ్గు కొరత వల్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి పడిపోయి.. కరెంట్ కష్టాలు వచ్చాయనేది ప్రభుత్వం వాదన. ప్రస్తుత సమస్య.. జగన్ నిర్వాకం వల్లేననేది ప్రతిపక్షం విమర్శ. కమిషన్ల కోసం ప్రముఖ కంపెనీల నుంచి బొగ్గు, విద్యుత్ కొనకుండా కుట్రలు చేసి.. ఇప్పుడు చేతులెత్తేస్తోందని అంటోంది. తమ తప్పేమీ లేదన్నట్టు ప్రధాని మోదీకి లేఖ రాసి.. బొగ్గు సమస్యను బూతద్దంలో పెట్టి చూపిస్తోందని తప్పుబడుతోంది. పక్క రాష్ట్రం తెలంగాణలో లేని ప్రాబ్లమ్... ఏపీకే ఎందుకొచ్చిందనేది టీడీపీ క్వశ్చన్. ఎప్పటిలానే ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోగా.. తాజాగా ఓ ఆసక్తికరమైన ఆదేశాలు ఇచ్చింది ఏపీ విద్యుత్‌శాఖ. అదేంటంటే....
ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వాడొద్దని సూచన చేశారు. ఈ స్టేట్‌మెంట్ విని అంతా అవాక్కవుతున్నారు. ఇదేంటి.. ఇదేమైనా ఎండాకాలమా.. పీక్ అవర్స్‌లో కరెంట్ డిమాండ్ అధికంగా ఉండటానికి? అని ఆశ్చర్యపోతున్నారు. ఏసీలు వాడకపోతే.. షాపింగ్ మాల్స్, మెడికల్ షాప్స్, సినిమా థియేటర్స్.. ఇలా గిరాకీ అధికంగా ఉండే ఈవెనింగ్ టైమ్‌లో వ్యాపారసంస్థలు ఇబ్బంది పడతాయని వాపోతున్నారు.
ఏపీలో విద్యుత్తు డిమాండ్- సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉందని.. అందుకే సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏసీల్ని వినియోగించొద్దని అంటున్నారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఏపీలో విద్యుత్ డిమాండ్ 20 శాతం పెరిగిందని.. కొవిడ్ కు ముందు అక్టోబరులో రోజుకు 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. ఇప్పుడు 195 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందన్నారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్ ప్లాంట్లలో 40 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి తగ్గిందని.. పవన్ విద్యుత్తు రెండు.. మూడు మిలియన్ యూనిట్లకు మించి రావటం లేదని చెబుతున్నారు. ఈ కొరతను తగ్గించుకోవటం కోసం ఏసీలు అందరూ వాడటం ఆపేస్తే.. 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందనేది అధికారుల వాదన.
ఇక డిమాండ్, కొరత పెరగడంతో.. విద్యుత్ కొనుగోలు రేటు కూడా బాగా పెరిగిందట. సెప్టెంబరు 16న యూనిట్ కు రూ.4.60 ఉన్న ధర.. ఇప్పుడు ఏకంగా రూ.9.40కు చేరుకుందని.. అక్టోబరు ఆరో తేదీకి ఇది రూ.14 అవుతుందని చెబుతున్నారు. అందుకే ప్రజలు వీలైనంత వరకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. అసలే అప్పుల రాష్ట్రమైన ఏపీ.. ఇంతేసి ధరలు పెట్టి కరెంట్ కొనడం తలకుమించిన భారంగా మారుతోంది. పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడిలా ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇదంతా సరేకానీ, మరి, ఇవే సమస్యలు మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎందుకు లేవు? ఒక్క ఏపీలోనే ఎందుకీ కరెంట్ కోతలు? అని ప్రశ్నించుకుంటే చాలు.. సీఎం జగన్ పాలనా సామర్థ్యం ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుందని అంటున్నారు.
న్నారు. అలా కాని పక్షంలో ఫ్యూచర్ లో సర్దుబాటుఛార్జీల పేరుతో భారం తప్పదన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. సో.. ఏపీ ప్రజలు బుద్ధిగా విద్యుత్ వినియోగం విషయంలో ఆచితూచి అన్నట్లు వాడాల్సిన సమయం వచ్చేసిందన్న మాట.