2 నెలల్లో రెండున్నర లక్షల పెన్షన్లు కట్.. అవ్వతాతల ఉసురు తీస్తున్న జగన్?
posted on Sep 6, 2021 @ 11:27AM
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు.. ఇది వైసీపీ అధినేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నినాదం. ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా ఆయన చెప్పింది ఇదే. జగన్ మాటలు నమ్మి ఏపీ జనాలు ఆయనకు ఓట్లేశారు. కాని అధికారంలోకి వచ్చాకా నాలుక మడతేశారు సీఎం జగన్. మాట తప్పడం.. మడమ తిప్పడమే తన పని అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను తుంగలో తొక్కిన జగన్ .. తాజాగా అవ్వతాతలపై పడ్డారు. ఏడాదిగా 250 రూపాయల చొప్పున పెన్షన్ డబ్బులు పెంచుతానని మాట తప్పిన జగన్.. ఇప్పుడు ఏకంగా పింఛన్లను రద్దు చేసే పనిలో పడ్డారు.
వివిధ కారణాలతో వృద్దుల పెన్షన్లు తీసేస్తోంది వైసీపీ ప్రభుత్వం. గత రెండు నెలల్లోనే దాదాపు 2 లక్షల 30 వేల పెన్షన్లు కట్ చేశారని తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పెన్షన్లు కట్ చేస్తున్నారు. జూలైలో పింఛన్ అందుకున్న లక్షలాది మంది అవ్వ తాతలకు ఆగస్టులో పెన్షన్ రాలేదు. ఒకటో తారీఖున తమకు పింఛన్ డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులకు షాకిచ్చింది జగన్ రెడ్డి సర్కార్. తమ పేర్లు పెన్షన్ జాబితా నుంచి తీసేశారని వాలంటీర్లు చెప్పడంతో షాకయ్యారు బాధిత అవ్వ తాతలు. తమ పేర్లను ఎందుకు తొలగించారో చెప్పాలని వేడుకుంటున్నారు. పెన్షన్ తీసేశారనే ఆవేదనతో కొందరు వృద్ధులు గుండె పగిలి చనిపోయారు. మరి కొందరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెన్షన్ తీసేశారనే బెంగతో 13 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని టీడీపీ ఆరోపిస్తోంది. వృద్ధుల మరణానికి సీఎం జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులకు పెన్షన్లు అందకుండాపోతుండడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న వైఎస్ జగన్ తుంచుకుంటూ పోతున్నారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు, మడమ తిప్పారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు. 'గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేశారు. మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది వృద్ధులు మృతి చెందారు' అని ఆయన ట్వీట్ చేశారు.
'మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ.2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతి అవ్వా తాత దగ్గరా నెలకు రూ.500 కొట్టేస్తున్నదేకాక భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం వూరికేపోదు వైఎస్ జగన్' అని లోకేశ్ హెచ్చరించారు.'ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్నీ వెంటనే ఇవ్వాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
వృధ్యాప్య పింఛన్ ప్రతి సంవత్సరం రూ 250/- పెంచుకుంటూ పోతా అని చెప్పిన జగన్, రెండున్నర ఏళ్ళు దాటిపోయినా పింఛన్ ను పెంచిన పాపాన పోలేదు. కాగా వృద్దులకు ఇచ్చే పింఛన్ ఏ నెల ఫించన్ ఆ నెల లోనే తీసుకోవాలని రూల్ పెట్టారు, ఒక వేళ ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే ఆ నెల పింఛన్ ఇక రాదు. గత టీడీపీ ప్రభుత్వంలో 3 నెలల పింఛన్ ఒకే సారి తీసుకొనే అవకాశం ఉంది. అలాగే ఫించన్ రాష్ట్రంలో ఎక్కడేనా తీసుకోవచ్చు అనే వెసులుబాటు ఉంది. కొంత మంది వృద్ధులు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉన్నవారు, పనుల మీద వేరే ఊరికి వెళ్లిన వారు, పట్టణాలలో పిల్లల వద్దకు వెళ్లిన వారు. రెండు, మూడు నెలల తర్వాత కూడా వచ్చి పింఛన్ తీసుకునే వారు. ఇప్పుడు జగన్ ఏ నెల పింఛన్ ఆనెల లోనే తీసుకోవాలని చెప్పడంతో అవ్వా, తాతలు అంత ఆందోళన చెందుతున్నారు.