చంద్రబాబు ఇష్యూ డైవర్ట్‌కే అమరావతి నిర్ణయం? జగన్‌రెడ్డి డైవర్షన్ పాలి..ట్రిక్స్!
posted on Nov 22, 2021 @ 12:01PM
స్మశానం అన్నారు. నిర్మానుషం అన్నారు. పనికిరాదన్నారు. ఇక పని లేదన్నారు. అమరావతిని ఆగమాగం చేశారు. ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసి.. మూడు దిక్కులకు విసిరేశారు. దిక్కున్నవారికి చెప్పుకోమన్నారు. హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. అక్కడ మొట్టికాయలూ పడ్డాయి. అయినా, తగ్గేదే లే అని విర్రవీగారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని.. చంద్రబాబు కలల స్వప్నాన్ని.. చిదిమేసే ప్రయత్నం గట్టిగా చేశారు. 700 రోజుల రైతు ఉద్యమాన్ని తీసిపారేశారు. అలాంటిది.. అమరావతిని నాశనం చేయడంలో అంత పట్టుదలగా ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వం.. సడెన్‌గా జై అమరావతి.. జైజై అమరావతి.. అని అంటుండటం ఆశ్చర్యమే. అంతకంటే ఆసక్తికరమే. సడెన్‌గా జగన్ సర్కారు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్టు? తప్పిన మడమను మళ్లీ ఎందుకు సరిచేసుకుంటున్నట్టు? రైతుల ఉసురుపోసుకునేందుకూ వెరవని ముఖ్యమంత్రి.. ఇప్పుడే ఎందుకు అమరావతికి వెల్‌కమ్ చెప్పినట్టు? ఎందుకు? ఎందుకు? ఎందుకు? అంటే ప్రధానంగా ఒకే ఆన్సర్ వస్తోంది. అంతా అందుకేనేమో అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎందుకంటే.. చంద్రబాబును ఏడిపించి.. భువనేశ్వరిని అవమానించిన.. ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికేనని అంటున్నారు.
చంద్రబాబును, భువనేశ్వరిని పర్సనల్‌గా అటాక్ చేసి.. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి.. ప్రతిపక్ష నేతను ఎమోషన్‌కు గురి చేసి.. వెక్కి వెక్కి ఏడ్చేలా చేసి.. నీచాతి నీచమైన రాజకీయం చేశారు జగన్‌రెడ్డి అండ్ బ్యాచ్. చంద్రబాబు అంతటి నేత అలా భోరున విలపించడం చూసి యావత్ రాష్ట్రం రగిలిపోయింది. కన్నీరు పెట్టింది. ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. టీవీల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కనిపిస్తే.. చెప్పులతో కొట్టారు. శాపనార్థాలు పెట్టారు. ఆత్మహత్యాయత్నాలు కూడా జరిగాయి. ఓ మహిళ గురించి, నందమూరి కుటుంబ సభ్యురాలి గురించి, చంద్రబాబు భార్య గురించి.. అంత నీచంగా మాట్లాడుతారా? అంటూ సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
నందమూరి కుటుంబం మొత్తం కదలివచ్చింది. ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ నేతల భరతం పడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులు సైతం అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి.. ఉన్నపళంగా ఎన్నికలు పెడితే.. జగన్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలనే కసితో ఉన్నారు ఏపీ ప్రజలు.
చంద్రబాబు-భువనేశ్వరి విషయంలో బాగా డ్యామేజ్ జరిగిందని గుర్తించారు జగన్‌రెడ్డి. నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు.. పెద్ద శిక్షే పడేలా ఉందని భయపడ్డారు. చంద్రబాబు అలా వెక్కి వెక్కి ఏడ్వడం చూసి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆ ప్రజాగ్నిలో వైసీపీ ప్రభుత్వం కాలిబూడిద అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన జగన్‌రెడ్డి.. వెంటనే ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడ వేశారంటున్నారు. ఇంత పెద్ద ఇష్యూను.. అందే పెద్ద సంచలన నిర్ణయంతో కనుమరుగు చేయాలనే స్కెచ్ దాగుందని అనుమానిస్తున్నారు. అమరావతికి జై కొడుతూ.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో.. ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయింది. మీడియా మొత్తం హోరెత్తింది. బ్రేకింగ్ న్యూస్‌లు, చర్చలు, సంబరాలు, రైతుల ఆనందాలతో.. ఏపీలో ఒక్కసారిగా ఫీల్‌గుడ్ వాతావరణం ఏర్పడింది. ఇదే కదా జగన్‌కు కావలసింది. ఈ అమరావతి గుడ్‌న్యూస్‌లో చంద్రబాబు సాడ్ న్యూస్ కొట్టుకుపోవాలని.. ప్రజల దృష్టి నుంచి కనుమరుగు కావాలనేది జగన్‌రెడ్డి స్కెచ్ అంటున్నారు విశ్లేషకులు.