జగన్ కు సుప్రీంలో షాక్, నో బెయిల్
posted on Oct 5, 2012 @ 1:35PM
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీ వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. విదేశీ నిధుల ప్రవాహనం దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన హవాలా మనీ మార్గాలను కొన్నింటిని చేధించామని న్యాయవాది మోహన్ పరాశరణ్, అశోక్‌భట్ వాధించారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను తారుమారు చేస్తారన్నారు. జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించగలిగారని జగన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు.