జగన్ బెయిల్ పై ఉత్కంఠ, నేడే విచారణ
posted on Oct 5, 2012 @ 11:52AM
జగన్ కి బెయిలొస్తుందా రాదా..? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. సామాన్యులకుకూడా దీనిమీదే ఆసక్తి. శుక్రవారం జరగబోయే విచారణలో జగన్ కి బెయిలొస్తుందని కొందరు, రాదని కొందరు పోటీలుపడుతున్నారు. జగన్ కి బెయిల్ మంజూరౌతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఉంది. జగన్ వ్యతిరేకవర్గంమాత్రం ఆరునూరైనా బెయిల్ దొరకనే దొరకదంటూ గట్టిగానే ప్రచారం మొదలుపెట్టేసింది. రెండింటిలో ఏదినిజమవుతుందో తెలియని ఉత్మంఠ. గత నెల 28న విచారణ సమయంలో తాము లాయర్‌ను మార్చినందున సమయం కావాలన్న సిబిఐ అభ్యర్దన మేరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. గతంలో బెయిల్ పిటీషన్‌పై విచారించిన సుప్రీం సీబీఐ తీరును ప్రశ్నించడం యువనేతకు కలిసొచ్చే అంశమని వారు చెప్తున్నారు. జగన్ తరపున మాజీ సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం, సీనియర్ న్యాయవాది అమన్ లేఖి వాదనలు వినిపించనుండగా... సిబిఐ తరపున మోహాన్ జైన్ స్థానంలో మోహాన్ పరాశరన్ వాదించనున్నారు. ఈసారి మోహాన్ పరాశరన్‌కు , గతంలో సిబిఐ తరపున వాదించిన అశోక్ భాన్ సహాయపడనున్నారు.