ఆయన 'సెంట్రల్' పవర్ చూపించారు మరి...
posted on Apr 10, 2020 @ 9:24PM
* చెప్పా పెట్టకుండా, ఏ. పి . సరిహద్దులు దాటిన సిపిడిసిఎల్ సి.ఎం.డి. పద్మా జనార్దన్ రెడ్డి
* విస్మయం వ్యక్తం చేసిన సచివాలయం వర్గాలు
అందరికీ ఒక రూలు...అయ్యవారికో రూలు అన్నట్టుంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( సి పి డి సి ఎల్ ) చైర్మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి ఎం డి) జె పద్మా జనార్దన్ రెడ్డి చెప్పా పెట్టకుండా, రాష్ట్ర సరిహద్దులు దాటేశారని ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సంఘాలు చెవులు కోరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార వాహనంలో నిన్న ( గురువారం) మధ్యాహ్నం 3నుండి4గంటల మద్యలో గరికపాడు దగ్గర, ఆంద్రప్రదేశ్ బోర్డర్ దాటి తెలంగాణ కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం లాక్ డౌన్లో విధులు నిర్వహించవలసిన సి. యమ్. డి విధులకు గైరు హాజరవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఒక పక్క ఐ ఏ ఎస్ లు, ఐ పి ఎస్ లు, ఇంకా గ్రూప్ వన్ అధికారులందరూ ఎక్కడిక్కడ కరోనా అత్యవసర విధుల్లో ఉంటె, ఎవరి అండ చూసుకుని సి ఎం డి పద్మా జనార్దన్ రెడ్డి ఇలా రాష్ట్ర సరిహద్దులు దాటారని సచివాలయం అధికారులు కూడా అనుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పద్మా జనార్దన్ రెడ్డి , స్థానిక విద్యుత్ శాఖ ఉద్యోగుల సహకారం తో లోకల్ పోలీసులను మేనేజ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కొందరు సి పి డి సి ఎల్ అధికారులు ఈ విషయం తీసుకెళ్లారని కూడా విద్యుత్ సంఘాల నాయకులు అంటున్నారు.