గవర్నర్ కు నాయుడు ఈ-మెయిల్
posted on Apr 10, 2020 @ 8:58PM
* ఏమిటీ ఆర్డినెన్స్, తక్షణం ఆపేయండి
ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ని తొలగించడం సరికాదని పేర్కొంటూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు, ఈ సమయంలో ఆడ్డదారిన ఎస్‌ఈసీని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అర్ధాంతరంగా కమిషనర్‌ను మార్చడం అనైతికం, చట్టవిరుద్ధమన్నారు. ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిసిన తర్వాతే అమలు చేయాలి. తాజా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఈ-మెయిల్ ద్వారా గవర్నర్‌కు పంపిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.