ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం.. స్వచ్ఛంద పదవీ విరమణ
posted on Jul 19, 2021 @ 5:15PM
సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వాలంటరీగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది.
ఇటీవలే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు భీమ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఈయన సమక్షంలోనే జరిగింది. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. హిందూ దేవతలను కించపరిచేలా ఈ ప్రతిజ్ఞ చేశారని విమర్శలొచ్చాయి. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వాలంటరీగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
వాలంటరీగా పదవీ విరమణ విషయమై ప్రజలకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కృతజ్తలు తెలిపారు. వ్యక్తిగత కారణాల రిత్యా విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు.రెండు పేజీల లేఖను ప్రజలకు రాశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ లేఖలో అనేక విషయాలను వెల్లడించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విడుదల చేసిన లేఖ కింద ఇస్తున్నాం..