రోజా - పెద్దిరెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం... తలలు పట్టుకుంటున్న వైసీపీ శ్రేణులు...
posted on Feb 1, 2020 @ 10:28AM
ప్రతిపక్షంలో ఉండగా సైలెంట్ గా ఉన్న వైసీపీ లీడర్లు... అధికారంలోకి వచ్చాక ఆధిప్యతం కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఆమధ్య నెల్లూరు జిల్లాలో ఎమ్మెుల్యేలు కోటంరెడ్డి-కాకాని గొడవలతో సింహాపురి వైసీపీ పరువు రోడ్డున పడగా... ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ముఖ్యనేతల మధ్య హైఓల్టేజ్ వార్ మొదలైంది. ప్రస్తుతానికి ఇది ప్రచ్ఛన్నయుద్ధంగానే సాగుతున్నా... ఏదోఒకరోజు మాత్రం అగ్నిపర్వతంలా బద్ధలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నగిరి వైసీపీ లీడర్ కేజే కుమార్ కేంద్రంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.... నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా మధ్య మొదలైన సైలెంట్ వార్ తారాస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇరువురి మధ్య ప్రచ్ఛన యుద్ధం జరుగుతోందని అంటున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పెరిగిపోయాయని చెబుతున్నారు. తాజాగా బయటికి వచ్చిన రోజా వాయిస్ మెసేజే ఇందుకు రుజువు అంటున్నారు. నగరి వైసీపీ లీడర్ కేజే కుమార్ ...తన షష్టిపూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమూలంను ఆహ్వానించాడు. అయితే, రోజాతో ఉన్న విభేదాలతో నియోజకవర్గ ఎమ్మెల్యే అయినాసరే ఆమెను కేజే కుమార్ పక్కనబెట్టాడు. దాంతో, మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న కేజే కుమార్ కార్యక్రమానికి వెళ్లొద్దంటూ తన నియోజకవర్గ వైసీపీ నేతలకు, కార్యకర్తలకు రోజా అల్టిమేటం ఇచ్చారు. తన మాటను కాదని ఎవరైనా వెళ్తే శాశ్వతంగా పార్టీకి దూరమవుతారంటూ నగరి వైసీపీ శ్రేణులను రోజా హెచ్చరించారు.
మొత్తానికి నగరి వైసీపీ నేత కేజే కుమార్ బర్త్‌డే వేడుకల కేంద్రంగా చిత్తూరు జిల్లా వైసీపీలో బయటపడిన ఆధిపత్య పోరు కలకలం రేపుతోంది. ఒకరు సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... మరొకరు ఫైర్ బ్రాండ్ రోజా కావడంతో... ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని జిల్లా వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి.