వైసీపీ నేతల రౌడీయిజం.. టోల్ సిబ్బందిపై దాడి.. ఒకరికి తీవ్రగాయాలు..
posted on Nov 5, 2021 @ 11:44AM
వైసీపీ కండువా వేసుకుంటే చాలు రౌడీల్లా రెచ్చిపోతున్నారు. గూండాల్లా దాడులు చేస్తున్నారు. చిల్లర మూకంతా పోగై దాడులకు తెగబడుతున్నారు. స్వయానా పార్టీ అధినేతే ప్రోత్సహిస్తున్నట్టున్నారు.. వైసీపీ బ్యాచ్ అంతా అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా, టోల్ గేట్ సిబ్బందిపై రెచ్చిపోయి దాడికి దిగారు వైసీపీ నాయకులు.
టోల్ ఫీజు అడిగిన పాపానికి సిబ్బందిని చితక్కొట్టారు అధికారపార్టీ మూకలు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ దగ్గర జరిగిందీ ఘటన. పాయకరావుపేటకు చెందిన కొందరు వైసీపీ నాయకులు కారులో టోల్ గేట్ దగ్గరికి రాగా.. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఫీజు చెల్లించాలని అడిగారు. తాము వైసీపీ నేతలమని.. ప్రజా ప్రతినిధులమని.. తమనే టోల్ రుసుం అడుగుతారా? అంటూ వారితో గొడవకు దిగారు. మాటామాటా పెరిగడంతో.. రెచ్చిపోయిన వైసీపీ వాళ్లు.. సిబ్బందిపై దాడి చేశారు.
వైసీపీ శ్రేణుల దాడిలో టోల్‌గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గొడవంతా సీసీకెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.