బెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా.. చంద్రబాబు@3
posted on Aug 30, 2025 @ 1:34PM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 16 నెలలు అయ్యింది. అంతకు ముందు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో అభివృద్ధి ఆనవాలే కనిపించలేదు. సంక్షేమం పేరిట అరకొర పందేరాలు వినా ప్రజలను ఇసుమంతైనా ప్రయోజనం కలిగే పథకాలూ లేవు, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలా ప్రాజెక్టులూ లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. కొత్తవి రాలేదు. జగన్ హయాంలో అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగింది. ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. అప్పులు వినా, రాష్ట్రానికి ఆదాయమన్నదే లేకుండా పోయింది. ప్రభుత్వోద్యోగుల వేతనాలు కూడా విడతల వారీగా చెప్పించే పరిస్థితి ఉండేది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఘండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పరుచుకున్నాయి. సంక్షేమానికి సముచిత ప్రాథాన్యతా లభించింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నట్లుగా పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ 16 నెలల కాలంలో రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు తరలి వస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి కొత్త జవజీవాలు వచ్చాయి. అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంకు భిన్నంగా ఇప్పుడు పాలనలో పారదర్శకత పెరిగింది. ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రజామోదం లభించింది.
ఇప్పుడు విషయానికి వస్తే.. దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రులు అంటూ ఇండియా టుడే తాజాగా జారీ చేసిన బాబితాలో చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇదే ఇండియా టుడే గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ఉత్తమ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న చంద్రబాబు ఏడాది తిరిగే సరికి మూడో స్థానానికి ఎగబాకారు. తాజా జాబితాలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలోనూ, పశ్చిమబెంగాల్ సీం రెండోస్థానంలోనూ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. అధికారం చేపట్టిన 16 నెలలలోనూ ఈ స్థానంలోకి దూసుకురావడం అంటే ఆయన పనితీరుకు లభించిన ప్రజామోదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.