భారత్ లో అత్యంత ధనికుడు ఆఖరి నిజాం

 

ప్రపంచం మొత్తంమీద అత్యంత సంపన్నుడు ఎవరని అడిగితే ఠక్కున ఏ బిల్ గేట్సో అని చెప్పేయడం మామూలైపోయింది. కానీ.. ఇలాంటి అంచనాలు తప్పని రుజువుచేసే పక్కా వివరాల్ని సెలబ్రిటీ నెట్ వర్త్ అనే వెబ్ సైట్ సేకరించింది. లండన్ పత్రిక ద ఇండిపెండెంట్ ఈ వివరాల్ని ప్రచురించింది. జాబితాలో మొత్తం 24మంది ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే బతికున్నారు. భారత్ లో ఇప్పటివరకూ అత్యంత ధనికుడైన వ్యక్తి ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని లెక్కలు పక్కాగా చెబుతున్నాయ్. అంతేకాదు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. 1967లో 80 సంవత్సరాల వయసులో చనిపోయిన ఉస్మాన్ అలీ ఖాన్ భారతీయులందరిలోకీ ఆల్ టైం సంపన్నుడని సెలబ్రిటీ నెట్ వర్త్ చెబుతోంది. ఆయన ఆస్తుల విలువ 11.80,000 కోట్ల రూపాయలు. 14వ శతాబ్దంలో మాలిని పరిపాలించిన మన్సా మూసా అనే రాజు ప్రపంచంలోకెల్లా ఆల్ టైం సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 20,00,000 కోట్ల రూపాయలు.  ఉప్పు , బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవడంవల్లే ఇంత సంపదను పొందగలిగాడట. నెట్ వర్త్ వెబ్ సైట్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో 14మంది అమెరికన్లే ఉన్నారు. జాన్ డి రాక్ ఫెల్లర్ అమెరికాలో ఆల్ టైం సంపన్నుడిగా అవతరిస్తే, వారెన్ బఫెట్ కి మాత్రం ఈ జాబితాలో అతి బీదవాడి స్థానం దక్కింది. అదికూడా ఆయన దాన ధర్మాలు చేయడానికి ముందున్న లెక్కల్ని తీసుకుంటేనే..

1)   

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.