ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై ఇండియా గెలుపు
posted on Aug 20, 2012 @ 2:38PM
19 సంవత్సరాలలోపు బాలుర ప్రపంచకప్ పోటీలలో చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ పై ఇండియా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. టౌన్స్ విల్లె లోని టోనీ ఐర్లాండ్ స్టేడియంలో జరిగిన భారత - పాకిస్తాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత బౌలర్లు పాకిస్తాన్ ను 136 పఫుగులకే కట్టిడి చేసింది. అటుపిమ్మట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు అతి కష్టం మీద 137 పరుగులు చేయడానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత క్రికెట్ అభిమానులలో సందడీ నెలకొంది. రంజాన్ పర్వదినాన భారత జట్టు పాకిస్తాన్ పై విజయం సాధించి క్రికెట్ అభిమానులకు రంజాన్ కానుకను అందజేసింది.