సీతమ్మ వాకిట్లో...ఎఫెక్ట్, దిల్ రాజు ఆఫీస్ పై ఐటీ దాడులు
posted on Jan 10, 2013 @ 10:07PM
సినీ నిర్మాతలు దిల్ రాజు, దానయ్యల కార్యాలయాలు, నివాసాలపై గురువారంనాడు ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేశారు. సినీ పరిశ్రమపై ఆదాయపు పన్నుశాఖల దాడులు సాదారణమయినప్పటికీ, ఇద్దరూ కూడా పెద్ద నిర్మాతలు కావడం, ఇద్దరూ కూడా పెద్ద హీరోలతో సినిమాలు తీస్తుండటంవల్ల ఈ దాడులకు కొంత ప్రతేకత ఉంది. దిల్ రాజు మహేష్ బాబు మరియు వెంకటేష్ లను పెట్టి తీసిన సినిమా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' మరి కొద్ది గంటల్లో విడుదల కానుండగా ఈ దాడులు జరగడంతో ఆదాయపు పన్నుశాఖ అధికారుల దృష్టి దిల్ రాజు ఆదాయం పైనే కాకుండా. ఆ ఇద్దరు హీరోలతో అతను చేసుకొన్నఅగ్రిమెంటు మీద కూడా పడే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, తరువాత వారిరువురి వంతూ వస్తుందనుకోవచ్చును. అదేవిదంగా నిర్మాత దానయ్య కార్యాలయంపై జరిపిన దాడిలో ఈ రోజు విడుదలయిన రామ్ చరణ్ తేజ చేసిన ‘నాయక్’ సినిమా అగ్రిమెంటుపై దృష్టిసారిస్తే, ఇంతవరకు నిశ్చింతగా ఉన్న రామ్ చరణ్ తేజకి కూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులతో తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంది. తీగలాగితే దొంక కదలుతుందంటే ఇదేనేమో!