అత్యుత్తమ సిఎంల జాబితాలో చంద్రబాబు
posted on Feb 13, 2025 @ 11:55AM
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ప్రతీ ఆరునెలలకోసారి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానానికి చేరుకోవడం సంచలనమైంది. ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ ఆరు నెలల్లో తన స్థానాన్ని ఆయన మెరుగుపర్చుకున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడినా పెట్టడంలో చంద్రబాబు సఫలీ కృతులయ్యారు. అంతే కాదు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు.
అత్యుత్తమ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యానాథ్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో ఆయన ప్రజాదరణ చూరగొన్నారు.