ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం
posted on Feb 13, 2025 @ 11:18AM
చింతచచ్చినా పులుపు చావదు అన్నట్టు ఉంది వైకాపా పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయినా వైకాపాకు బుద్దిరాలేదు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై బుధవారం అర్ధరాత్రి వైకాపా గూండాలు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత దెందులూరు అట్టుడుకింది. తనపై ఏలూరులో వైకాపా గూండాలు దాడి చేశారని చింతమనేని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును వైకాపా గూండాలు అటకాయించారు. ఎమ్మెల్యే గన్ మెన్ దగ్గర నుంచి గన్ లాక్కొనే ప్రయత్నం చేసినట్టు ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. తనపై ఐరన్ రాడ్డుతో దాడి చేశారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.