పిన్నెల్లి పాపాలపై డీజీపీ కీలక నివేదిక
posted on May 22, 2024 @ 8:23PM
మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు. సీఈఓ ఎంకే మీనా ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఈ నివేదిక అందజేశారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ పేర్కొన్నారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజీలాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ గుప్తా వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేసిన కేసులో ఏ 1గా చేర్చామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.