Read more!

హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థులు వీరే

 

హిమాచల్ ప్రదేశ్‌లో లార్జి డ్యామ్ గేట్లు తెరవడం కారణంగా హైదరాబాద్‌కి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 48 మంది విద్యార్థులు స్టడీ టూర్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళారు. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. అప్పటివరకు ఉల్లాసంగా.. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ, ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడింది. తేరుకునే లోపే దాదాపు 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. వారిలో కొందరి వివరాలు....

 

గల్లంతైన విద్యార్థుల పేర్లు..

1. శ్రీనిధి, 2. రిశిత, 3. ఐశ్వర్య, 4. గాయత్రి, 5. విజిత, 6. రిధిమ పాపాని, 7. విదియ, 8. దేవాశిష్ బోస్, 9. రిత్విక్ రావు, 10. ఆశిష్ మంథా, 11. సందీప్ బస్వరాజ్, 12. అరవింద్, 13. పరమేష్, 14. జగదీష్, 15. అఖిల్, 16. ఉపేందర్.

 

క్షేమంగా వున్న విద్యార్థులు...

 

1. రమణ్ తేజ, 2. రిషిక, 3. లావణ్య, 4. రఘువంశ్, 5. దివ్య, 6. శ్రీకర్, 7. మౌనిక, 8. దీప్తి, 9. ప్రత్యూష, 10. నవ్య, 11. రాకేష్, 12. స‌ృజన్, 13. నితిన్, 14. శ్రీకాంత్, 15. రాఘవేంద్ర, 16. చేతన్. విద్యార్థుల పూర్తి వివరాలు అందాల్సి వుంది.