గ్యాంగ్‌రేప్‌లు కావు.. కట్టు కథలు! తేల్చేసిన హైదరాబాద్ పోలీసులు
posted on Aug 19, 2021 @ 7:30PM
పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మీడియా తెగ హడావుడి చేసింది. దారుణం, కిరాతకం అంటూ వార్తలు ప్రసారం చేశాయి. ఇవి చూసిన జనాలు కూడా ఇంత ఘోరమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. జాతీయ మహిళ కమిషన్ కూడా ఎంటరైంది. మహిళా సంఘాల ఆందోళనలు చేశాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరికి అసలు కథ తేల్చారు. అసలేం జరిగిందే తేలడంతో షాకవడం జనాల వంతైంది.
తెలంగాణలో ఆరోపణలు వచ్చిన రెండు గ్యాంగ్ రేప్ ఘటనలు ఫేక్ అని తేలింది. అవన్ని కట్టుకథలేనని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు వెల్లడించారు. అత్యాచారం ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ అంజన్ కుమార్ మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీ ఆస్పత్రి ఘటనలో యువతి చెబుతున్నట్టుగా ఎలాంటీ అత్యాచారం జరగలేదని చెప్పారు. మహిళల వ్యక్తిగత అవసరం కోసమే ఇదంతా చేశారని సీపీ తెలిపారు.
గాంధీ హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరి అక్కా చెల్లెలకి కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరు చాలా ఒత్తిడికి గురయ్యారని వివరించారు. ఈ సమయంలోనే అక్క బయటికి వెళ్ళిపోయిందని, అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని వెల్లడించారు.. ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో 7వ ఫ్లోర్‌లో లైంగికంగా కలిశారని వెల్లడించారు.. ఆ తరువాత మరొకసారి గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో కూడా ఇలాగే జరిగిందని తెలిపారు.. ఈ క్రమంలోనే తన కోసం అక్క కొడుకు రావడంతో నిస్సహయంగా సెల్లార్ పడి ఉండడం చూసి ఇంట్లో తెలియడం వల్ల బాగుండదనే అభిప్రాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
ఇక కొన్ని రోజులుగా ఆచూకి లభించకుండా వెళ్లిపోయిన ఆమె అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తితోనే గడిపిందని వెళ్లడించారు. ఈ సంఘటనలోల్యాబ్ టెక్నీషియన్ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును చేధించేందుకు 500 సీసీ కెమెరాలతోపాటు సుమారు 800 గంటల సీసీ ఫుటేజిని పరీశీలినట్టు హైదరాబాద్ సీపీ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు.
అలాగే సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్ పూర్తిగా అభూతకల్పన అని పోలీసు అధికారులు తేల్చారు. ప్రియుడు తనని పెళ్లిచేసుకోనని చెప్పడంతో.. అతడిని కేసులో ఇరికించేందుకు ప్లాన్ వేశారని తెలిపారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ యువతి స్టోరీ అల్లిందన్నారు. రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి.. రేప్ కథను తల్లికి చెప్పిందన్నారు. విచారణలో యువతి చెప్పిందంతా కట్టుకథగా నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు