రాసలీలల ఆడియో వైరల్.. ఆ వాయిస్ ఏపీ మంత్రిదేనని ప్రచారం
posted on Aug 19, 2021 @ 9:09PM
ఆంధ్రప్రదేశ్ లో ఓ రాసలీలల ఆడియా లీకై వైరల్ గా మారింది. ఓ మహిళతో ఓ వ్యక్తి సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తం 2.20 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో టేపులో ఓ వ్యక్తి నేరుగా ఓ మహిళకు ఫోన్ చేసి తన వద్దకు రావాలంటూ కోరారు. అంతేకాకుండా తన వద్దకు వస్తే.. అన్ని బాగుంటాయని.. అన్ని రకాలుగా బాగుంటుంది.. చెప్పిన మాట విను అంటూ తనదైన శైలిలో ప్రలోభపెట్టే యత్నం చేశారు. ‘‘పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. ఓ అరగంటలో పంపిస్తా.’’ అంటూ ఓ వ్యక్తి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది
ఆ వ్యక్తి పిలుపునకు ఆ మహిళ ససేమిరా అంటుండగానే.. సరే మరి నీ ఇష్టం.. నీళ్లను దగ్గరికి తీసుకురాగలం కాని తాగించలేం కదా.. అంటూ మరింతగా రెచ్చిపోయారు. ఆ తర్వాత తన వద్దకు వస్తే.. అరగంటలోనే పంపించేస్తానని చెప్పాడు సదరు వ్యక్తి.అయితే ఆ మహిళ నవ్వుతూనే ఆయన ఆఫర్ కు ససేమిరా అన్నారు. కింద సెల్లార్ వాకింగ్ చేస్తున్నానని ఆ మహిళ అంటే.. సరే వచ్చేయి అరగంటలో పంపిస్తాను.. నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది.. అంటూ ఫ్లర్టింగ్ చేశారు ఆడియో టేపులో ఉన్న వ్యక్తి.
మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియోలో ఉన్న వాయిస్ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సంభాషణలను బట్టి అది అవంతి ఇల్లో, కార్యాలయమో అని.. ఆయన ఉన్న అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న మహిళే అని, అవంతితో ఆమెకు ముఖ పరిచయం కూడా ఉందని అర్ధమవుతోందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది.
గతంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రాసలీలల ఆడియో కూడా లీకై ప్రకంపనలు స్పష్టించింది. మసాజ్ కోసం తన వద్దకు వచ్చేందుకు సిద్ధమైన ఓ మహిళ తాను అడిగిన పనులన్నీ చేస్తుందా? అంటూ అడిగి అంబటి రాంబాబు ఆడియోలో అడ్డంగా బుక్ అయిపోయారు. ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దానిని ఖండిస్తూ రాంబాబు చాలా విషయాలే చెప్పారు. ఏడాది పాటుగా తనపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఆ ఆడియో బయటకు వచ్చిందని అన్నారు. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, ఇలాంటి వీడియోలను తన నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దంటూ చిలుక పలుకులు పలికారు.
ఈ తరహా వీడియోలు బయటకు రాగానే.. తమకేమీ తెలియదని, కుట్రపూరితంగా తమ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఎవరో తామంటే గిట్టని వారు ఈ ఆడియోను బయటకు వదిలారని రాజకీయ నేతలు చెబుతుంటారు. గతంలో అంబటి రాంబాబు కూడా తనపై కుట్ర జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆ వ్యవహారంపై ఆయన స్పందించలేదు. తనపై కుట్ర చేసిన వారెవరన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. దీనిని బట్టి చూస్తుంటే.. తాజాగా విడుదలైన ఆడియోపైనా అవంతి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.