వారం రోజుల్లో పది కేసులు సాల్వ్.. 20 మంది అరెస్టు!
posted on Oct 30, 2025 @ 3:23PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఘనత
క్రిమినల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న దాదాపు 20 మందిని హైదరాబాద్ క్రైమ్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేసి దాదాపు పది కేసులను ఛేదించారు. వీటిలో మూడు కోట్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులు కూడా ఉన్నారు. హైదరాబాద్ సైబర్ పోలీసులు అక్టోబర్ 22 నుండి 28 వరకు అంటే వారం రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాలపై దృష్టి సారించి... మొత్తం 10 ప్రధాన కేసులను ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో మోసా లకు పాల్పడుతున్న 20 మందిని అరెస్టు చేశాడు. విచారణలో దేశంలోని పలు రాష్ట్రాలలో సైబర్ నేరాలకు పాల్పడు తున్న ముఠాలు విస్తరించి ఉన్నట్లు గా తేలింది. అరెస్టు చేసిన 20 మందిలో 14 మంది ట్రేడింగ్ మోసాలకు పాల్ప డినట్లుగా పోలీ సులు గుర్తిం చారు.
అరెస్టు చేసిన వారి వద్ద నుండి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పది కేసులలో ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ కేసు ప్రధానమైనది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయి మోసాలకు పాల్పడిన ముఠా వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ మోసంలో కంపెనీకి 3,0091,683 నష్టం వాటిల్లింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఇటువంటి మోసా లు జరిగినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.
చెన్నుపాటి శివ నారాయణ, కడలి నారాయణస్వామి, అడుగుల రాజ్ కుమార్, జడ్డా బ్రహ్మయ్య, పేరి చర్ల వర్మలు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయిలో మోసాలకు పాల్ప డ్డారు. ఈ ఏడాది మే నుండి జూలై వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ ఫ్లాట్ ఫామ్ లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా ఓ సంస్థ గుర్తించింది. కంపెనీ అంతర్గత ఆడిట్ లో టిక్కెట్లు బుకింగ్ చేసిన సంఖ్య, వాస్తవ ఆదాయం మధ్య విపరీతమైన తేడా ఉన్నట్లుగా తేలింది. దీంతో అంతర్గత ఏజెంట్లు, కొంతమంది యూజర్లు వాలెట్ సిస్టంలో ఉన్న టెక్నికల్ లోపాన్ని ఉపయోగించి అక్రమంగా డబ్బులు సంపాదించినట్లుగా తేలింది. ఈ నిందితులు వాలెట్ రీఛార్జ్ చేసుకొని టికెట్ బుక్ చేసే వారు. వెనువెంటనే ఆ టికెట్ రద్దు చేసేవారు. సాఫ్ట్వేర్ లోపం కారణంగా రిఫండ్ డబ్బు తిరిగి జమ అవ్వడమే కాకుండా అసలు వాలెట్లో ఉన్న మొత్తాన్ని కూడా రెండు సార్లు చూపించేది. ఈ అవకాశాన్ని ఉపయోగించి వారు మళ్ళీ మళ్ళీ అదే పని చేసేవారు. ఈ విధంగా ఫేక్ బ్యాలె న్స్ తో ఇతరులకు టికెట్లు బుక్ చేసి కస్టమర్ల దగ్గర నుండి నేరుగా తమ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకు నేవారు. నింది తులు ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ కోట్లలో డబ్బులు సంపాదిం చారు. అయితే ఈ విధంగా జరిగిన మోసాలను కంపెనీ గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరియు డిజిటల్ వాలంట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు చేసిన మోసా నికి కంపెనీకి మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లిన ట్లుగా దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాల బారిన పడకుండా సంస్థలు, వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా www. Cyber crime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు