కోడలితో అక్రమ సంబంధం.. కొడుకుని చంపిన తండ్రి..
posted on Jul 27, 2021 @ 3:34PM
నేటి సమాజంలో కొంత మంది సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. రోజు రోజు అక్రమ సంబంధాలతో పక్కద్రోవ పడుతున్నారు. నేటి సమాజంలో వావివరసలు లేకుండా తయారు అయ్యారు. తండ్రి వ్యవహరించాల్సిన వాడు ఇలా అడ్డదారులు తొక్కాడు.తాజాగా ఒక వ్యక్తి తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ఈ విషయం కొడుక్కి తెలియడంతో తండ్రి, కొడుక్కి మధ్య వివాదం జరిగింది. కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ తండ్రి తన సుఖానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హతమార్చాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు తన కొడుకు కనిపించడం లేదంటూ ముందుగానే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విచారణలో అసలు నిజం బయటపడటంతో ఈ కిరాతకుడిని పోలీసులు ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ రాజధాని పాట్నా. ఆ ప్రాంత పరిధిలోని కొద్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతని పేరు మిథిలేష్ రవిదాస్. అతని కుమారుడు సచిన్‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. సచిన్ గుజరాత్‌లో ఉద్యోగం చేస్తుండటంతో పెళ్లైన కొద్దిరోజులకే భార్యను వదిలి ఆఫీసుకు వెళ్లాడు.ఇక అంతే ఒంటరిగా ఉంటున్న కోడలిపై కన్నేసిన రవిదాస్. ఆమెను మాయమాటలు చెప్పాడు. ముగ్గులోకి దించాడు చివరికి లోబరుచుకున్నాడు. కొడుకు ఇంట్లో లేకపోవడంతో అతడు నిత్యం కోడలిలో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం గుజరాత్‌లో ఉన్న సచిన్‌కు తెలియడంతో జులై ఏడో తేదీన ఇంటికి చేరుకుని తండ్రిని నిలదీశాడు. తండ్రి కి మాటలు రాలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో రవిదాస్ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా అతన్ని మట్టికరిపించాలనుకున్నాడు. ఓ కత్తి తీసుకుని కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా, ఆ హత్యకు సంబందించిన కేసు బయటికి రాకుండా ఉండేందుకు సచిన్ శవాన్ని తోటలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ ఒక నాటకం మొదలు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత తెలివైనోడైనా సరే చిన్న చిన్న తప్పులతో దొరికిపోతారని చెప్పినట్లు. ఈ వ్యవహారం వెనుక అదే ప్రాంతానికి చెందిన ఐదుగురిపై అనుమానం ఉందని తెలిపాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి.
చివరికి సచిన్ శవాన్ని తోటలో గుర్తించిన పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆ రిపోర్టులో అతడిని గొంతు కోసి చంపేసినట్లు తేలడంతో పోలీసులు రవిదాస్‌ను ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. తన కోడలితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తానే కొడుకుని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.