భర్త 8 హత్యలు.. భార్య 11 హత్యలు..
posted on Jul 29, 2021 @ 3:23PM
భార్య భర్తలు సమానం.. ఆడమగ సమానం.. ఉద్యోగం లోను, ఉపాధిలోను , భార్యాభర్తలు అన్ని విషయాలలో కలిసే ఉండాలి. కష్టాలు సుఖాలు ఏవైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అని మన పూర్వికులు , పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ భార్యాభర్తలు ఆ విషయాన్నీ చాలా గట్టిగా నమ్మినట్టు ఉన్నారు. పెద్దల మాట సద్దన్నం మూట అనుకున్నారేమో.. భర్త తప్పుచేస్తే దండించాల్సిది పోయి ఆమె కూడా భర్తతో కలిసి దారుణాలకు పాల్పడింది. అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని హత్యలు చేయడంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఈ హత్యలు చేసే ఆదర్శ దంపతులు . ఇంకా చెప్పాలంటే హత్యలు చేయడంలో భర్త కన్నా భార్య ఒకడుగు ముందే ఉంది. భర్త 8 హత్యలు చేస్తే.. ఒకటి కాదు, రెండు కాదు భార్య ఏకంగా 11 హత్యలు చేసి.. భర్తను మించిన భార్య పనిపించుకుంది. ఎందుకు వారేమైనా సైకో లా అంటే కాదు..బందిపోట్ల అంటే అంతకన్నా కాదు.. వారికీ బంగారంపై మోజు. ఈజీ మనీ కోసం ఆ భార్యాభర్తలు గంభీర్, సెవాగ్ పాట్నర్ షిప్లో సెంచరీ సెంచరీ చేసినట్లు.. ఏకంగా వేళ్ళు మొత్తం 19 మందిని హతమార్చారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. దుండిగల్‌లో వరుస హత్యల కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బంగారం కోసం ఒంటరి మహిళలను దారికాచి హత్య చేస్తున్న క్రూర దంపతుల కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.
వివరాలలోకి వెళితే.. అది సంగారెడ్డి జిల్లా. జిన్నారం మండలం. మాదారం గ్రామానికి చెందిన స్వామి. అతని వయసు 27 సంవత్సరాలు. అతని భార్య. ఆమె వయసు 26 ఈజీ మనీ కి అలవాటు పడ్డారు. దీని కోసం వారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలు కనిపిస్తే వాళ్ళే వీరి టార్గెట్మా.. వాళ్ళకి యమాటలు చెప్పి, చిన్నగా వాళ్ళని ముగ్గులోకి దించి. వారిని నమ్మించి మసిబూసి మారేడుకాయ చేసి జిన్నారం అడవుల్లోకి తీసుకు వెళ్తారు. ఇక అంతే అక్కడికి వెళ్ళాక వాళ్ళ దగ్గరనుంచి డబ్బు, బంగారం లాక్కొని కిరాతకంగా హత్యచేస్తారు. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ బంగారం కోసం 15 మందికి పైగా మహిళలను హత్య చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనెల 25న మల్లంపేటలోని కూలీ అడ్డా నుండి భామిని(35)అనే మహిళను జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి భార్యాభర్తలు హత్యచేశారు. స్వామిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించిగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం, డబ్బు కోసమే 15 మందికి పైగా మహిళలను హత్య చేసారని పోలీసులు తెలిపారు. భర్త 8 హత్యలు భార్య 11 హత్యలు చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతామని పోలీసులు తెలిపారు.
మహిళలపై మాములుగానే ఒక వైపు స్టూడెంట్స్, మరో వైపు ఇంట్లో తల్లిదండ్రులు. మరో వైపు ఆఫీస్ లో యజమానులు. చైన్ స్నాచింగ్ బ్యాచ్ మరో వైపు ఇటువంటి వాళ్ళు వరుసగా దాడులు చేస్తున్నారు.. ఇక ఆడవాళ్లు ఈ సమాజంలో బతకాలంటేనే భయమేస్తుంది.. ఇటువంటి సమాజంలో మహిళలు బతుకుతునందుకు తల వంచుకుంటుంది ఈ మహిళా సమాజం.. ఇంకెప్పుడు స్త్రీ స్వేచ్ఛ సమాజం అవతరించేది..