అవశేషాలతో ఆభరణాలు.. ఎక్కడో తెలుసా..
posted on Jul 16, 2021 @ 4:36PM
అందరూ ఆభారణాలు అనగానే బంగారం అనుకుంటారు లేదంటే.. ఈ మధ్య కాలంలో అలంకరణకు సముద్రంలో దొరికిన వస్తువులను వాడుతారు.. లేదంటే రోల్డ్ గిల్డ్ వాడుతారు... కానీ ఆ దేశంలో శనిపోయిన శవాల పార్ట్స్ ని వాళ్ళ గుర్తుగా ఆభరణాలుగా ధరిస్తారు.. ఈ ప్రపంచంలో మనిషి జీవితం చాలా ఉన్నతమైనది.. అలాగే పవిత్రమైనది కూడా.. మనిషి ప్రాణాలతో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అందరితో బంధాలు, భాందవ్యాలు బలంగా ఉంటాయి. ప్రాణం పోతే.. ఆ ప్రాణం పోయిని శవాన్ని మట్టిలో కప్పికెత్తడంతోనే వారితో ఉన్న సంబంధాలన్ని తెగిపోతుంటాయి. కానీ ఆ మనిషి తెలుగు జ్ఞాపకాలు కొంత కాలం ఉంటాయి ఆ తర్వాత కాలంతో పాటు కరిగిపోతాయి. చివరికి వారి తాలూకా తీపి గుర్తులు మనస్సులో ఉంచుకోవటం తప్ప చేయగలిగింది ఏమి ఉండదు. మహా అయితే వారు వినియోగించిన వస్తువులను మాత్రం పదిలపరుచుకోగలం. అయితే, పోయిన వారి అవశేషాలను శాశ్వితంగా , గుర్తుగా ఉంచుకునే వీలు కల్పిస్తుంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ జ్యుయలరీ దుకాణం… ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుందా ఐతే మరి ఇంకెందుకు ఆలస్యం..
ఆస్ట్రేలియా చెందిన చెందిన ఒక మహిళ. ఆమె పేరు జాక్వి విలియమ్స్. ఆమె గ్రేవ్ మెటాలమ్ పేరుతో జ్యువెలరీ షాపు నడుపుతుంది. ఈ ఆభరణాల దుకాణాని అక్కడ ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ తయారయ్యే ఆభరణాలన్నీ చనిపోయిన వారి అవశేషాలను నిక్షిప్తం చేస్తూ ప్రత్యేమైన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మరణించిన వాళ్ళు మనతోనే ఉన్నారు అనే ఫీలింగ్ కోసం ఈ ఆభరణాలు తయారు చేస్తారు. చనిపోయిన తమవారిని మర్చిపోలేని వారు, తమతోపాటు వారి గుర్తులను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలనుకునే వారు, ఇంతకీ ఆ ఆభరణాలు చేయడానికి కావాల్సిన మణిలోని పార్ట్స్ ఏంటో తెలుసా దంతాలు , కాలిపోయిన బూడిద, ఇతర ఎముకుల వంటి అవశేషాలను సేకరించి గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీ దుకాణంలో అందిస్తారు. ఇంకంతే వాటిని ఆభరణాల మధ్యలో నిక్షిప్తం చేసి కళాత్మకమైన ఆభరణాలుగా తీర్చిదిద్ది తిరిగి అందిస్తారు.
ఇక్కడ తయారవుతున్న అవశేషాల ఆభరణాల్లో ముఖ్యమైనవి, చాలా ప్రాధాన్యతను పొందినవి మెడకు ధరించే భరణాలు, ఉంగరాలు, కంకణాలు ఉన్నాయి. వీటిలో దంతాలు, చితాభస్మం వంటి వాటిని పదిలంగా నిక్షిప్తం చేస్తారు. ఉంగరాలు, చైన్ లాకెట్లు, బ్రాస్ లైట్లు ఇలా వివిధ రూపాల ఆభరణాలను తమకు నచ్చినట్లు తయారు చేయించుకుంటారని మెల్బోర్నో లో ఉన్న గ్రేవ్ మెటాలమ్ ఆభరణాల దుకాణ యజమాని 29 సంవత్సరాల విలియమ్స్ చెబుతోంది. ఇలాంటి ఆభరణాలు తీపిగుర్తులుగా మిగిలిపోవటమేకాకుండా, దుఖా:న్ని దిగమింగుకునేందుకు దోహదపడతాయని విలియమ్స్ అంటుంది.