ఆర్టీసీ కార్మికుల మొత్తం డిమాండ్ లలో ఆర్థిక భారం కాని డిమాండ్ల పై చర్చ జరపాలి: హైకోర్ట్
posted on Oct 28, 2019 @ 5:02PM
ఆర్టీసీ కార్మికుల మొత్తం నలభై ఐదు డిమాండ్ లలో కార్పొరేషన్ పై ఆర్థిక భారం కాని డిమాండ్ల పై చర్చ జరగాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. మొదట ఇరవై యొక్క డిమాండ్లపై చర్చ జరిగితేనే కార్మికులలో కొంత ఆత్మ స్థైర్యం కలుగుతుంది అని వివరించింది న్యాయస్థానం. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, కార్మిక సంఘాల విలీనం సహా అన్ని డిమాండ్ల పై కూడా చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఇరవై ఒక్క డిమాండ్ల పై చర్చ చేపడదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు మాట వినలేదు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటికు వెళ్లిపోయారు. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఒక్క డిమాండ్ పైనే పట్టు పట్టకుండా మిగతా డిమాండ్ల పై చర్చలు జరపవచ్చు కదా అని హై కోర్టు తెలిపింది. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టి మిగిలిన వాటిపై చర్చించాలని హై కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారు. కేవలం ఇరవై ఒక్క డిమాండ్ల పైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు ఇతర డిమాండ్ల పై చర్చించలేదు. యూనియన్ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.
మొత్తం నలభై ఐదు డిమాండ్ లకు సంబంధించి సమ్మె నోటీసులు ఇచ్చాం, కేవలం ఇరవై ఒక్క డిమాండ్ లను చర్చిస్తామంటే తామెలా ఒప్పుకుంటామంటూ కార్మిక సంఘాలు వాదనలు వినిపించారు కానీ, హైకోర్ట్ మాత్రం మొదట ఇరవై ఒక్క డిమాండ్ లకు సంబంధించి చర్చ జరిగితేనే ఇరు వర్గాల మధ్య సయోద్య కుదురుతుందని అలా అయితే ప్రజలకు కూడా కొంత ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పింది. అయితే ఇరు వర్గాల వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి, వాదనలు పూర్తి అయిన తరువాత హైకోర్ట్ ఏం చెప్తుంది అనేది తేలనుంది. సెప్టెంబర్ నెల జీతాల విషయం కూడా ఈ వాదనలో ఆర్టీసీ కార్మిక సంఘాలు అడగనున్నారు.