శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన.. 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్..
posted on Jul 20, 2021 @ 9:52AM
ఈ ప్రపంచం మోసం అనే మాట మీద నడుస్తుంది. ఒకడు బతకాలి అంటే మరొకడ్ని మోసం చేయాలి. ఒక దేశం ఎదగాలంటే మరొక దేశాన్ని నాశనం చెయ్యాలి. అందుకు కొందరు ఎంచుకున్న మార్గమే యువతను డ్రగ్స్ కి అలవాటు చేయడం. ఇక ముఖ్య విషయానికి వస్తే ఎప్పుడు లేని విదంగా ఈ మధ్య కాలంలో మన దేశంలోకి డ్రగ్స్ తరలిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా, జాంబియా.. లాంటి వివిధ దేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్‌ని భారత్‌కు తరలిస్తున్నారు. ఐతే ఆ స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఎన్ని ఎత్తులు వేసిన చివరికి పోలీసుల చేత్తోలో చిత్తూ అవుతున్నారు. ఎయిర్‌పోర్టులోనే దొరికిపోతున్నారు. తాజాగా మరోసారి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడింది.
హైదారాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు సిసి కెమెరాలకంటే ఎక్కువగా పని చేస్తున్నారు. వాళ్ళు నిత్యం ఎంతో పగడ్భంధీగా తనిఖీలు చేసినా, అధికారుల కళ్ళు కప్పి డ్రగ్స్ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్ తో ఉందని అనుమానించిన పోలీసులు ఆమె దగ్గరి నుంచి 3.2 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశం నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో దోహా మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది ఓ మహిళ. అయితే ఆమె ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ముందస్తు సమాచారంతో డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు బ్యాగ్‌ను అధికారులు తనిఖీ చేయగా, అందులో 3.2 కేజీల హెరాయన్ ను గుర్తించారు. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు డిఆర్‌ఐ అధికారులు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విలువ 21 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒకవైపు విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతుండగా, అటు డ్రగ్స్‌ని కూడా పెద్ద ఎత్తునా తరలించడం ఆందోళనకు గురి చేస్తోంది. బంగారం అక్రమ రవాణా చేసేవారు కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా ఉండేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. ఎలక ఎన్ని ఎత్తులు వేసిన పిల్లికి చిక్కాల్సిందే అన్నట్లు స్మగ్లర్లు ఎంత అతితెలివితో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డా, కస్టమ్స్ అధికారులకు మాత్రం దొరికిపోతున్నారు. ఇటు డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారిపై అధికారులకు ముందస్తుగానే సమాచారం రావడంతో అలర్ట్ అవుతున్నారు. నిందితులు ఎయిర్‌పోర్టులోకి అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.