సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రత్యేకతలు ఇవే..
posted on Sep 11, 2021 @ 11:54AM
స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో హాస్పిటల్ లో చికత్స కొనసాగుతోంది. వైద్యులు ఔట్ ఆఫ్ డేంజర్ అని చెబుతున్నప్పటికి.. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. 48 గంటల పాటు సాయి ధరమ్ తేజ్ అబ్జర్వేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. సాయిధరమ్ తేజ పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. సాయిధరమ్ తేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్నీ అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు అక్కడే ఉన్నారు.
హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురికావడంతో ఆయన రైడ్ చేసిన వాహనంపై జనాల్లో చర్చ జరుగుతోంది. Sai Dharam Tej యాక్సిడెంట్ కాగానే వెంటనే ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఆయన నడిపిన బైక్ విజువల్స్ కూడా వచ్చాయి. తర్వాత సాయి ధరమ్ కేజ్ ప్రమాద విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. దీంతో చాలామంది ఆ బైక్ ఏమిటి? ఆ Bike Cost ఎంత ఉంటుంది, ఎంత speedగా వెళ్తుంది, ఎంత పవర్ ఉంటుంది, దాని ప్రత్యేకతలు ఏమిటి వంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
Sai Dharam Tej నడిపిన బైక్ కంపెనీ పేరు ట్రయంఫ్ (Triumph). సాయి ధరమ్ తేజ్ వాడుతున్న ట్రయంఫ్ బైక్ మోడల్ పేరు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ (Street Triple RS). Triumph Street Triple RS ధర రూ. 11,61,000 నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షో రూం ప్రైస్. యాక్సెసరీస్, రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపితే ధర ఇంకా పెరుగుతుంది.ఇది 765 సీసీ కెపాసిటీ బైక్. 6 గేర్లు ఉంటాయి. ఈ బైక్ బరువు 166 కేజీలు. ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ 17.4 లీటర్లు. ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 13 నుంచి 15 కిలోమీటర్లు వస్తుందని వాడేవారు చెబుతారు.
ట్రయంప్ మోటార్ సైకిల్స్ అనేది బ్రిటన్ కంపెనీ. బ్రిటన్‌లో మోటార్ సైకిళ్ల కంపెనీలలో ఇదే టాప్.ఇంగ్లాండ్‌లో కంటే థాయిలాండ్‌లో వీళ్లకు పెద్ద ప్రొడక్షన్ యూనిట్ ఉంది. ఇది సెలబ్రిటీ బైక్. ట్రయంఫ్ మోటార్ సైకిళ్లకు మాంచి క్రేజ్ ఉంది. చాలామంది సెలబ్రిటీల గ్యారేజ్‌లలో ఈ బైక్ కనిపిస్తుంది. అడ్వంచరిస్ట్ Bear Grylls, హాలీవుడ్ యాక్టర్లు David Beckham, Tom Cruise, George Clooney దగ్గర ట్రయంఫ్ బైక్‌లున్నాయి. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జామ్‌వాల్, జాన్ అబ్రహం టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ వద్ద కూడా ఈ బైక్ ఉంది.