Read more!

మహిళల గుండెకు ముప్పు పొంచి ఉందా ?

పురుషుల కన్నా మహిళల్లో నే గుండెపోటు సమస్యతో మరనిస్తున్నారు .సహజంగా స్త్రీలకు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద చూపరు. ఎచిన్న సమస్యకైన మళ్ళీ వస్తే చూద్ద్దాం అన్న ధోరణిలో ఉంటారు.అదే వారి పాలిట శాపం గా మారుతుంది ఒక కేసు విష యం లో రోగి పరిస్థితి చూసిన డాక్టర్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ ఇన్ని రోజుల నుండి రాకుండా ఏమి చేసారు. ఇప్పుడు చూడండి 7౦% బ్లాక్స్ ఏర్పడ్డాయి.కోపంగా మందలించారు.చెమట పడుతుంటే వేడి ఎక్కువగా ఉంది కదా అని అనుకున్నా మెట్లు ఎక్కు తుంటే ఆయాసం వస్తుంటే పనెక్కువ అయ్యిందని అందుకే అలసట వచ్చిందని అనుకున్నా. గుండె నొప్పి నాకు ఎందుకు వస్తుంది? అని సరి పెట్టుకున్నా కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. అని అన్నది ఆమె.కన్న బిడ్డకు చిన్న జలుబు చేసినా కంగారు పడిపోతారు.భర్తకు చిన్న జ్వరం వచ్చినా హడావిడి చేస్తారు. ఇంట్లో ఎవరికీ ఏం జరిగినా కంగారు పది పోయే డి ఆ ఇంటి మహాలక్ష్ములే. అదే మహిళలు తమ అనారోగ్య గురించి మాత్రం పట్టించుకోరు అందుకు చాలా సందర్భాలాలో జబ్బు బాగా ముదిరి పోయే దాకా చికిత్సకు వెళ్లరు. ఇక గుండె జబ్బు విషయానికి వస్తే అదేదో మగ వాళ్ళకు మాత్రమే వచ్చే జబ్బుగా అనుకుంటారు. గుండె జబ్బుకు స్త్రీలు, పురుషులు అన్న పక్ష పాతం ఉండదు. ఆ కులము ఈ కులము అన్న వివక్ష ఉండదు. ఈ మతము ఆమతము అన్న పక్ష పాత ధోరణి గుండెకు ఉండదు. ఎవరు అన్నారు గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వచ్చే వని స్త్రీలకు భావోద్వేగాల ను భరించే శక్తి సహనం ఎక్కువే. ఓర్పు ఒర్చుకోవడం స్త్రీ ల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది. అంటూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని ఉన్నా అతి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం గా చెప్పవచ్చు. నిజానికి పురుదులతో పాటు సమానం గా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం  ఎక్కువే సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు అదీ రోమ్ముక్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ,ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుందేజబ్బుల వల్ల మరణించిన వాళ్ళే ఎక్కువ అని ఒక అద్యయనం లోతేలింది.

స్త్రీలను వేదించే సమస్యలలో క్యాన్సర్ కన్నా 6 వంతులు ఎక్కువ అవకాశం గుండె పోటు కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.ముఖ్యంగా స్త్రీలు ౩౦ సంవత్సరాలు దాటగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి క్యాన్సర్ స్క్రీనింగ్ కు వెళుతూ ఉంటారు.అయితే పనిలో అనిగా గుండెకు సంబందించిన పరీక్షలు చేయించుకోడం లో మాత్రం ఎందుకో తాత్సారం చేస్తారు. తమ గుండె గట్టిదనే నమ్మకం తో ధీమా తో ఉంటారు.విద్యా వంతులైన మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండడం అంత క్షేమం కాదు.

గుండె పోటు మహిళ్ళలో రావడానికి కారణాలు...

గుండె పోటు అంటే అది మగవాళ్ళకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు అపోలో ఆసుపత్రికి చెందినా  ప్రముఖ హృద్రోగ నిపుణులుడాక్టర్ ఎ  శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిలో అదే ఆపోహ కలిగి ఉండడం విచారకరం అనారు వైద్య నిపుణులు.చాతిలో నొప్పి అని అనిపించినా అది గ్యాస్ నొప్పో,మరేదైనా నొప్పి గా భావిస్తారు. తప్ప గుండె నొప్పిగా అనుమానించరు. ఆడవాళ్ళలో గుండేనొప్పి తక్కువ కాబట్టి నాకు గుండె జబ్బు రావడం ఏమిటి నాకు అస్సలు గుండె నొప్పి వచ్చే అవకాశం లేదని విశ్వాశం తో ఉంటారు స్త్రీలు. స్త్రీలకూ గుండె జబ్బు ఉండనే విషయాన్ని గుర్తించడం లో మిస్ అవుతూ ఉంటారు .ముఖ్యంగా స్త్రీలు మెనోపాజ్ తరువాత మరణిస్తున్న మహిళల లో ప్రాధాన కారణం గుండె పోటే అయి ఉంటుంది.సాధారణంగా మెనోపాజ్ దశలో ఊపిరాడక పోవడం,బలహీనం గా ఉండడం, గుండె దడ నీరసం, లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో గుండె సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి.

కాబట్టి చాలా మంది వీటిని గుర్తించలేరు అని అంటారు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్.దాదాపు మెనోపాజ్ లో ఉండే సమస్యలే కదా అని అనుకుంటారు. అందుకే చాలా సందర్భాలలో  తమకు గుండె జబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించలేక పోతారు.కొన్ని సార్లు స్త్రీలలో వచ్చే ఆయాసాన్ని ఆస్తమాగా పోప్రబడతారు. లేదా నీరసం గా ఉన్నాం కదా అందుకే ఆయాసం గా ఉందేమో అనుకుంటారు.చాలా సంఫర్భాలలో మహిళలు గుండె నొప్పిని గుర్తించక పోవడానికి ఇదే కారణం. అయితే గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళ ల్లో వేరు వేరు గా ఉంటాయి అని శ్రీనివాస్ విశ్లేషించారు.సాధారణ గుండేనొప్పి లాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండక పోవచ్చు. ఆయాసం గా ఉండడం, చమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం,బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు లక్షనమం గానే బహిర్గతం అవుతాయి కాని అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా పర్గానించడం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు.ఇలాంటి సమయం లో చిన్న బ్లాక్ ఉన్నా అది హటాత్తుగా  విచ్చినం చెందవచ్చు. దాంతో అకస్మాతుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితం గా ప్రాణాల మీదకు వస్తుంది.

అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకాస్మాతుగా గుండె పోటుకు గురి అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మెనో పాజ్ దశలో లక్షణాల లో అశ్రద్ధ చేయవద్దని 4౦ ఏళ్ళు దాటినా గుండెకు సంబందించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయిన్చుకోవాలి.అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం పాప్స్మియర్ టెస్ట్ లు మమ్మో గ్రామ్ మామో గ్రఫీ, చేయించు కోవడం లేదు. చాలా మందికి మొదటి సారి గుండెపోటు రావడమే ప్రాణా పాయానికి  దారి తీస్తుంది.

 పరీక్షల్లోనూ వేరుగా ఉంటాయి...

సాధారణ లక్షనాలాతో గుండె జబ్బును కనిపెట్టడం కష్టం. కాబట్టి మహిళ ల్లో డయాగ్నిస్టిక్ పరీక్షలు కీలకం అవుతాయి. కొన్ని సార్లు ఈ పరీక్షలలో కూడా గుండె జబ్బు ఉన్నా లేనట్లుగా తేలే అవకాశాలు లేకపోలేదు. అందు వల్ల మహిళలు గుండెజబ్బు గుర్తించడం లో వైద్యుల నైపుణ్యం తో పాటు అన్ని రకాల పరీక్షలు ప్రాధాన పాత్ర వహిస్తాయని వాటి అన్నిటి సమీకృత ఫలితాలను బట్టే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.నిపుణులైన డాక్టర్లు మాత్రమే కేస్ హిస్టరీ ని బట్టి పరీక్షలు చేయిస్తారు. ఈ పరీక్షలలో ముఖ్యంగా ఇ సి జి ఎకో పరీక్షలు మార్పులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి .ఒక్కోసారి టి ఎం టి పరీక్ష కూడా తప్పుగా చూపించ వచ్చు. జబ్బు ఉన్న లేదని లేకున్నా ఉందని రావొచ్చు. కాబట్టి ఒకే పరీక్ష ఆధారం గా చెప్పలేము. ఈ పరీక్ష లన్నిటికీ బెరేజు వేసుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.ఆంజియో గ్రామ్ లో కూడా మహిళల డి ప్రత్యేకతే. పురుషులకన్న మహిళల శరీర నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా రక్త నాళాలు సైతం చిన్నవిగా ఉంటాయి. అన్జియో గ్రామ్ చేసేటపుడు ఉపయోగించే చేయి లేదా  కాలి రక్త నాళాలు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి అన్జియో గ్రామ్ చాలా జాగ్రతగా చేయాలి.

నైపుణ్యం లేకుండా అన్జియోగ్రామ్ చేస్తే సరైన ఫలితాలు రావు.మహిళ ల్లో గుండె రిస్క్ ఎక్కువ...

కొలస్ట్రాల్ పేరుకుపోయి అదేరో స్క్లిరో సిస్ రావడం సర్వ సాధారణం కాని మహిళలలో రక్త నాళాలు స్పాసమ్ అంటారు రక్త నాళాలు పట్టేసినట్లు. అయిపోవడంవల్ల కుంచించుకు పోతాయి.తద్వారా రక్త ప్రసరణ కష్టం అవుతుంది. రక్త నాళాలు పెద్దవైతే జబ్బు మొదలై నప్పటికీ రక్తం ప్రసరించడానికి ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి అడ్డంకి పెద్దది అయ్యే వరకూ జబ్బు ముదరదు. కాని రక్త నాళం చిన్నదిగా ఉండడం వల్ల చిన్న అడ్డకి ఏర్పడినా సమస్య ఎక్కువ అవుతుంది. అందు వల్ల ఒకే సైజు బ్లాక్ పురుషులలో అద్దంకి కాక పోయినా మహిళలలో మాత్రం పెద్ద సమాస్య అయి కూర్చుంటుంది. మహిళల లోనే రిస్క్ ఎక్కువ. పురుషుల కన్నా మహిళల్లో రక్త నాళాల పరిణామం చిన్నదిగా ఉండడం వల్ల చికిత్స విధానం లో కూడా వేరుగా ఉండడం వెర్రిలో రక్త నాళాలు మూసుకు పోయే అవకాశం చిన్న సైజు స్టెంట్ వాడాల్సి ఉంటుంది.

పెద్ద రక్త నాళాలలో మళ్ళీ అడ్డంకులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.చిన్న రక్త నాళాలు ఉన్నప్పుడు స్తేన్టింగ్ సరిగా చేయకుండా మళ్ళీ క్లోత్స్ రక్తం గడ్డ కట్టే అవకాశం లేదా అడ్డాకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్త నళాలలో అడ్డంకులు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోడానికి వాడే పరికరాలు కూడా మరింత ఆధునిక సంతరించుకుని అందుబాటులోకి వచ్చాయి ఇంట్రా వాస్క్యులార్ అల్ట్రా సౌండ్ ఆప్టికల్ కోహారెన్స్ టమో గ్రఫీ ద్వారా చికిత్సకు ముందు తరువాత అడ్డంకులు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. అయితే ఆధునిక పరిజ్ఞానం తో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడం కూడా ప్రాధాన అంశం.

గుండెపోటు వస్తే...

మహిళల లో కూడా మరణాల రేటు ఎక్కువ మగ వాళ్ళ కన్నా మూడు వంతులు ఎక్కువ సాధారణ మొదటి సారి గుండెపోటు వచ్చిన తరువాత చికిత్సచికిత్స చేయించు కోకుంటే పురుషులలో 2౦% రిస్క్ ఉంటె మహిళ లలో 5౦% రిస్క్ ఉంటుంది. రక్త నాళాలు చిన్న సైజువి కాబట్టి బైపాస్ లో కూడా రిస్క్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి స్టెంట్ సరిగా పెట్టక పోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. సమర్దులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోక పోతే పంపింగ్ సామర్ధ్యంభయపడాల్సిన అవసరం లేదు.జబ్బు ఉందన్న విషయాన్ని సకాలం లో గ్రహించకుండా తెలిసి నిర్లక్ష్యం చేసినా ఎటువంటి చేయించుకోక పోతే గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇటీవలే అందు బాటులోకి వచ్చిన బై వెంట్రీ క్యులర్ పెసింగ్ అన్న విధానం సత్ఫలితాలు ఇస్తుంది. గుండె పంపింగ్ సా మర్ధ్యం పెరగడం కోసం ఇక మరో దారి లేదనుకున్నప్పుడు దీనిని వాడతారు.

నివారణా ఉపాయాలు...

సమస్య ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లో మందులు జాగ్రత్తగా వాడుకుంటే గుండె జబ్బును అదిగా మించ వచ్చు.అయితే నివారణ అన్నది అన్నిటికన్నా ఉత్తమం.గుండెను కాపాడు కోవాలంటే ప్రధానంగా జీవన శైలి లో మార్పులు చేసుకోవడం అవసరం.ఒత్తిడి తగ్గించుకునే ప్రయాత్నం చేయాలి దైనందిన వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ చేసుకోవాలి.బిపి షుగర్ కొలస్ట్రాల్ రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒక వేళ ఈ సమస్యలు వచ్చినా అదుపులో ఉంచుకోడానికి డాక్టర్ సలహా మేరకు తప్పని సరిగా సలహా తీసుకోవాలి.సూచించిన విధంగా మందులు వాడుకోవాలి.స్థూల కాయం మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.