గన్నవరం నుండి పోటీకి హరికృష్ణ ఆసక్తి

 

ఫ్లెక్సీ బ్యానర్లతోనందమూరి సోదరుల మద్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన చిచ్చుఇంకా నివురు గప్పిన నిప్పులా రగులుతోనే ఉందని మీడియాలో కొత్తగా షికారు చేస్తున్నపుకార్లు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికలలో హరికృష్ణ గన్నవరం నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తని హరికృష్ణ కానీ జూ.యన్టీఆర్ గానీ దృవీకరించలేదు, ఖండించలేదు. ఒకవేళ నిజంగా ఆయన గన్నవరం నుండే పోటీ చేయదలిస్తే ముందుగా సిట్టింగ్ యంయల్యే దాసరి బలవర్ధాన్ రావు, అక్కడి నుండి పోటీ చేయాలనుకొంటున్న వల్లభనేని వంశీకి ఇబ్బందులు మొదలయినట్లే. అప్పుడు హరికృష్ణను కాదనలేని తెదేపా, అదే నియోజకవర్గం నుండి పోటీచేయాలని పట్టుదలతో ఉన్నవారిద్దరికీ నచ్చజెప్పడం, వారిని మరో నియోజక వర్గానికి పంపి అక్కడి వారితో మళ్ళీ శిగపట్లు పట్టడం అనివార్యం అవుతుంది. బహుశః ఈ ఆలోచనతోనే హరికృష్ణ గన్నవరం ఎంచుకొన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే, ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ మొదలు పెట్టిన మరో మైండ్ గేమ్ అయ్యున్దవచ్చును. ఏది ఏమయినప్పటికీ, మళ్ళీ హరికృష్ణ మరో మారు మీడియా ముందుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోక తప్పనిసరి పరిస్థితి సృష్టించింది.

Teluguone gnews banner