పోలీసు సేవలు భేష్ అన్న విద్యార్ధులు
posted on Oct 20, 2012 @ 12:13PM
సికింద్రాబాద్ లో శుక్రవారం స్కూలు పిల్లల కోసం హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఏర్పాటు చేసిన వివిధరకాలయిన గన్స్, పిస్టల్స్ ఎగ్జిబిషన్ పిల్లలను ఆకర్షించింది. ఎప్పుడూ సినిమాల్లో చూసే వెపన్స్ ను సిపి అనురాగ్ శర్మ ధగ్గరుండి చూపటంతో విద్యార్దినీ విద్వార్ధులకు సంతోషం కలిగించింది. గన్స్ లో రకాలు అవి పని చేసే తీరు, ఎక్కుపెట్టవలసిన విధానం పిల్లలకు పోలీసులు వివరించారు. అలాగే ఆందోళనలు చెలరేగినప్పుడు వారు ఉపయోగించే పద్దతులను కూడా మాక్ డ్రిల్ ద్వారా చూపడం కళ్లకు కట్టినట్లుందని విద్యార్దులు ఆనందం వ్యక్తం చేశారు. ఆందోళనాకారులు రాళ్లు విసురుతున్నప్పుడు పోలీసుల రకణ కవచంగా ఉపయోగించే షీల్టు, దాని ఉపయోగం కూడా వారు తెలుసుకున్నారు. అలాగే విద్యంసం జరిగినప్పుడు పోలీసులు అవలం భించే విధానంతో పాటు ఆందోళనాకారులను ఏలా తరిమి కొడతారో చూపారు. వాటర్ క్యాన్యను ఉపయోగించే పద్దతిని మక్ టెస్టులతో పోలీసులు వివరించడం వల్ల విద్యార్ధుల్లో పోలీసులపై అవగాహన పెరిగిందని విద్యార్ధులు తెలియ చేశారు. విధ్యార్ధుల్లో పోలీసులపై అవగాహన పెరగటానికి భవిష్యత్తులో విద్యార్దులు పోలీసు ఉద్యోగాలను ఎంచుకోవడానికి ఉపకరించాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహించి నట్లు కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.