మసాజ్ సెంటర్లో గన్ ఫైర్.. .
posted on Mar 17, 2021 @ 2:26PM
రిలీఫ్ కోసం మసాజ్ సెంటర్ కి వెళ్లారు. కొంత మంది కాల్పులు జరపడం తో శవాలుగా మిగిలారు. అట్లాంటా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అట్లాంటా ప్రాంతంలోని వేర్వేరు మూడు మసాజ్ పార్లర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 8 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
అట్లాంటా పోలీసు చీఫ్ ర్యాంట్ తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటాలోని బకెడ్, చెరోకీకౌంటీ ప్రాంతాల్లోని మూడు వేర్వేరు మసాజ్ పార్లర్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు మహిళలే కాగా.. వారు ఆసియాకు చెందిన వారు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కాల్పులకు సంబంధించి రాబర్ట్ ఆరోన్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మసాజ్ పార్లర్లనే లక్ష్యంగా చేసుకోవడంతో.. ఆయా ప్రాంతాల్లోని మిగతా కేంద్రాల వద్ద పోలీసులు భద్రత పెంచారు.