మటన్ పెట్టలేదని.. మరు పెళ్లి చేసుకున్న యువకుడు..
posted on Jun 25, 2021 @ 4:46PM
చుట్టాలు అనే వాళ్లు మన అవసరాలు తీర్చడానికి రారు.. వాడికి అవసరం ఉంటే వస్తారు. కొంత మంది చుట్టాలు ఐతే పెళ్లి చూసుకుని వచ్చి పెళ్ళిలో గొడవలు పెట్టి వెళ్ళిపోతారు.. ఎందుకంటే ఎదుటి వాడు నాశనం ఐతుంటే సంతోషిచేది ఒక మనిషి మాత్రమే కాబట్టి. అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసేవాడు కింద మీద పడి, అప్పోసప్పో చేసి పెళ్లి కుదిర్చి తన బరువు దించుకుందాం అనుకుంటే..మనకు అక్కరకు రాని సుట్టం. వాడి అవసరం కోసం వచ్చి పెళ్లి చెడట్టాడుతుంటారు. తాజాగా ఇలాంటి జరిగింది.. అది ఏంటో మీరే తెలుసుకోండి.
పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలవడమే అనుకుంటారు కానీ.. దాని వెనక ఒక పెద్ద తతంగమే ఉంటుంది. మాకు వ్యాల్యూ ఇవ్వలేదని కొందరు. మమల్ని పలకరించలేదని ఇంకొందరు. మాకు బట్టలు పెట్టలేదని మాకు బొట్టు కూడా పెట్టలేదని నానారకాలుగా ఆడిపోసుకుంటారు బంధువులు. ఇక పిలగాని తరుపున బంధువులు గల్లా ఎగరేస్తారు. అమ్మాయి తరుపున వాళ్ళు అయితే కొంచం అణిగిమణిగి ఉంటారు. ఇక ఇదంతా ఒక అయితే కొంత మంది పెళ్ళికి సంబంధం లేని వాళ్ళు కూడా గొడవలు పెట్టుకుని ఆగిపోయిన పెళ్లిళ్లు కూడా చూశాం.. ఏదైనా కార్యం చెయ్యాలంటే పెద్ద శ్రమ ఉంటుంది కానీ దాన్ని చెడగొట్టడానికి యెంత సేపు చెప్పండి.. కళ్ళు మూసి తెరిచినంత సాపు చెడగొటేయొచ్చు. అందరూ సతాయించడంతో పెళ్లి చేసే వాడికి తలలో ప్రాణం తోకలోకి వస్తుంది. ఇలా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వివాహాలు మనం చూస్తూనే ఉంటాం. గోరంత కారణాలు కూడా కొండంత వివాదాలుగా మారిపోయి పెళ్లిళ్లు రద్దవుతుంటాయి. ఇలాంటి ఆసక్తికర ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒరిసా లోని జాజ్ పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అయితే విందులో మటన్ పెట్టకపోవడం వివాదానికి కారణమైంది.
తమకు మటన్ కావాలని పెళ్లికొడుకు బంధువులు అడగడంతో... మటన్ లేదని పెళ్లికూతురు బంధువులు సమాధానమిచ్చారు. దీంతో గొడవ మొదలైంది. తమ బంధువులకు పెళ్లికొడుకు కూడా వత్తాసు పలకడంతో వివాదం ముదిరించి. చివరకు పెళ్లికొడుకు తన వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, మరుసటి రోజు అతను మరొక యువతిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.