గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
posted on Aug 30, 2025 @ 3:56PM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వీరిద్దరి పేర్లను ఆమోదించి గవర్నర్‌కి సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం తీసుకుంది. గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం కల్పించారు.ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీం.. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.
మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సర్వోన్న న్యాయస్ధానం అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తానేకే కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమని భావించాడు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ హస్తం పార్టీ అభ్యర్థి ఎవరై అనేది సస్పెన్స్ గా మారింది