Read more!

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగు పడాలి...సామాన్యుడి డిమాండ్!?

ప్రభుత్వ ఆసుపత్రిలో దేకరు కనీసం పట్టించుకోరు. మీరు మాకు చెపుతారా మాకుతెలుసు ఏమిచేయాలో. మీప్రస్నలకు సమాధానం ఇవాల్సిన అవసరం లేదు. మేము చేయాల్సింది చేస్తాము మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి. మాదగ్గిర ఇంతే మీరు మంత్రికి చెప్పిన ఎం ఎల్ ఏ కి చెప్పినా మీము చేసేదే ఫైనల్ అంటూ సగటు రోగిపట్ల అసభ్యపదజాలం తో తిట్టడం బాధ్యతారహితంగా ప్రవర్తించడం గమనించవచ్చు.కోవిడ్ సమయంలో సైతం కనీసం రోగి పరిస్థితిని చెప్పేందుకు సైతం అందుబాటులో లేకపోగా కనీసం రోగిబందువులను సైతం రోగిని చూసేందుకుఅనుమతించని స్థితి అప్పటివరకూ బాగానే ఉందని అన్నరోగి అమాంతం చనిపోయింది శవాన్ని అంబ్యు లెన్స్ లోకి ఎక్కిస్తే శరీరం నుండి రక్త కారడాన్ని గమనించారు తీరా చూస్తే రోగి శరీరంపై చీరిక ఉండడాన్ని గమనించి ప్రశ్నిస్తే అమ్బ్యులేన్స్ సిబ్బంది. వార్డ్ సిబ్బంది నుండి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని రోగి బంధువులు వాపోయారు. 

ఇది ఇలా ఉంటే రోగి శవాన్ని సైతం ఒకరి శవాన్ని మరొకరికి ఇవ్వడం పెద్ద తప్పిదం అయితే ఆసుపత్రి నుండి నేరుగా స్మశానానికి పంపినఘట నలు మనం చూసాం.  ఇదిలా ఉంటె కోరోనా సమయం క్రిటికల్ కేర్ లో ఉన్న డాక్టర్ ఆరోజుకాక వారం రోజులకు వచ్చేవాడని రోగి పరిస్థితి అర్ధం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో ట్రీట్మెంట్ ఇచ్చారని అసలు ఎచికిత్చ చేసారో కూడా తెలియని చికిత్చని రోగులకు అందించారు.? అన్నది ప్రశ్నార్ధకం గా మారింది. కొందరు  ప్రభుత్వ డాక్టర్లు నేరుగా తమ క్లినిక్ కు రావాలాని ఈ శాస్త్రచికిత్చ చేయమని తమ క్లినిక్ లో 4౦,౦౦౦  ఆపైన ఎంతైనా అవ్వచ్చని చెపుతూ రోగిని నిలివు దోపిడీ చేస్తున్నారు.రోగుల పట్ల ఎంతనిర్లక్ష్యం గా ఉన్నరనేందుకు ఇటీవల రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.సర్జరీ తరువాత సమస్యలు వచ్చాయని రోగి అంటున్నా అలాగే ఉంటుంది అంటూ చెప్పిన సమాధానం ప్రాణాలకు డాక్టర్ వెలకట్టిన తీరు బాధ్యత రాహిత్యం సిబ్బంది ప్రవార్తనా తీరు విస్మయం కలిగిస్తోంది సగటు మధ్య తరగతి వారిపట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకింత నిర్లక్ష్యం.? సగటు జీవిఅంటే అంత చులకన ఎందుకు సగటు జీవులు రోగులు కాదేమో. 

ఇది ఇలా ఉంటె ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుందామని వెళితే డాక్టర్లు ఉండరు ఒకసందర్భంలో అక్కడ ఉన్న నర్సులు పురుడు పోస్తే ఆతరువాత వచ్చిన సమస్యలకు బాధ్యులు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు,జిల్లా ఆసుపత్రులు మరీ దిగజారాయి. ఇక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో  ముఖ్యంగా ఏళ్లతరబడి రోడ్లు లేక డో లిలో  రోగులను తరలిస్తున్న తీరు పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

శాసన సభలో ఏళ్లతరబడి ప్రశ్నల వర్షం కురిపించిన ఎం ఎల్ ఏ నిధులు రావు ఎం పి నిధులు రావు సగటు గిరిజనుల గోడు ప్రభుత్వాలకి కనపడదు వినపడదు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం దేశ వ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఒకే డాక్టర్ సరిగా లేని వైద్య సిబ్బంది.సిబ్బంది కొరత,మండులకోరత ,అత్యవసరమైన సమయం లో చేయాల్సిన చికిత్చ కు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనించారు .ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్,లో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూర్ జిల్లలో  మహారాష్ట్రా,తమిళ్ నాడు, రాజస్థాన్, కేరళ, అస్సాం,జమ్మూ కాశ్మీర్లలో సైతం

ఇదే దుస్థితి నేలకోనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఒకవైపు నిధులు లేవని రాష్ట్రాలు అంటుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ను నిర్వహించాల్సిన బాధ్యత  రాష్ట్రాలదే అని కేంద్రం అందం మీరంటే మీరంటు సగటు మధ్య తరగతి వర్గానికి ఆరోగ్యాన్ని అందించే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ను నిర్లక్ష్యం చేసాయాని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మెరుగుకు డాక్టర్ల పై నిఘా లేదా వారి ఫోన్లలో జి పి ఎస్ ట్రాకర్లు మాత్రమే సరిపోదు వైద్యుల ప్రవర్తన తీరులో  మార్పు రావాలి.వచ్చిన రోగులపట్ల దురుసుగా ప్రవర్తించడం, వాడు,వీడు అని సంబోదించడం,అన్నిటికి మించి పురిటినొప్పులు పడుతున్న మహిళల పట్ల మొగుడు పక్కలో పడుకున్నప్పుడు లేని నొప్పి ఇప్పుడు వచ్చిందా అంటూ డాక్టర్ల మాటలు మహిళలను ఆత్మహాత్య చేసుకునే విధంగా ప్రేరేపించడంకాదా. అసలు లేని గర్భం ఉందంటూ 9 నెలలు ప్రిస్కిఫ్ షన్ ఇచ్చిన గోప్పడాక్టర్లు. 

క్యాన్సర్ ఒకదగ్గర వస్తే మరోచోట రేడియేషన్ ఇచ్చిన ఘనాపాటెల్ విష్యం లో ప్రభుత్వం ఏ చర్యాలు  తీసుకుంటుంది.కొన్ని సార్లు చేసిన సర్జరీల వల్ల కాళ్ళు పడిపోతే నష్టపరిహారం కళ్ళు పోయినవాళ్ళకి నష్ట పరిహారం ఇవ్వాలి. ప్రాణాలే తీసేసిన వాళ్ళకి అటేమ్ట్ టు మర్డర్ కేసు ను నామోడు చేయాలని సామాన్యుడు కోరుతున్నాడు. ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వ వైద్యులు సిబ్బంది తమ పనితీరును మార్చుకోవాలి. లేదా ప్రజా వైద్యానికి రాజీనామా చేసి సొంత క్లినిక్ పెట్టుకోవాలి. వైద్య సేవల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఉండాలి, పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి. బాగా సేవచేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.