అందాల ప్రపంచంలో వ్యభిచారం ఓ వికృత సైడ్ ఎఫెక్ట్!
posted on Nov 5, 2016 @ 1:47PM
దీపం అయినా, క్యాండిల్ అయినా తనకు దూరంగా వున్న చోట్లకి వెలుగుని పంచుతుంది. కాని, దగ్గర్లో మాత్రం నల్లటి చీకటి వలయం ఆవహించి వుంటుంది. గ్లామర్ ప్రపంచం కూడా అంతే! దూరం నుంచి చూసే వారికి మిలమిల మెరిసిపోతున్నట్టు కనిపించినా దగ్గరికి వెళ్లిన కొద్దీ చీకటి కోణాలు ఆవిష్కృతం అవుతుంటాయి! మరీ ముఖ్యంగా, గ్లామర్ ప్రపంచంలో సెక్స్ విషయంలో...
సినిమా, టీవీ, మోడలింగ్... ఇవన్నీ గ్లామర్ లోకాలు.అక్కడ అందరూ మేకప్ వేసుకునే వుంటారు. ఆ మేకప్ మాటున ఎవరు బాధితులో, ఎవరు బాధించే వారో అర్థం కాదు. అసలు ఏ బాదా లేన్నట్టు అందరూ నవ్వూతూ మోసగించటం, మోసపోవటం మరో విషాదం! అన్నిటికంటే ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో సెక్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయాల్లో డబ్బు ఎంత చక్రం తిప్పుతుందో ఇక్కడ శృంగారం అంతే ప్రభావం చూపుతుంది. అయినా ఎవ్వరూ ఓపెన్ గా మాట్లాడరు. క్యాస్టింగ్ కౌచ్ అనో, సెక్స్ రాకెట్ అనో మీడియా ఎన్ని పేర్లు పెట్టినా అంతా ఓ పబ్లిక్ సీక్రెట్ లాగే మిగిలిపోతుంటుంది...
ఆ మధ్య బాలికా వధూ అనే సీరియల్ లో ప్రదాన పాత్ర పోషించిన ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. గుర్తుందిగా? డబ్బింగ్ సీరియల్ ద్వారా ఆనంది పాత్రలో ఆమె తెలుగు వారికి కూడా పరిచయమే. కాని, ఈ బుల్లితెర ఆనంది నిజ జీవితంలో మాత్రం ఆనందం కరువైంది. కారణం ఏంటో తెలుసా? వ్యభిచారం! అవును... నిన్న మొన్నటి వరకూ ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో గొడవల వల్ల మరణించిందని అందరూ అనుకున్నారు. కాని, దాన్ని నిజం చేస్తూ బయటపడ్డ ఫోన్ కాల్ రికార్డింగ్ అందర్నీ షాక్ కి గురి చేసింది. ఒక టాప్ పొజీషన్లో వున్న నటికి కూడా ఇలాంటి ఒత్తిళ్లు వుంటాయా అని ఆలోచనలో పడేలా చేసింది.
ప్రత్యూష, తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో లాస్ట్ టైం మాట్లాడిన మాటలు గ్లామర్ ప్రపంచం గాయాల్ని పట్టి చూపిస్తాయి. ఆమె అతడితో, తన చేత వ్యభిచారం చేయించి జీవితం నాశనం చేశావని అంది. అంతే కాదు, తన గురించి, తన కుటుంబం గురించి అందరూ దారుణంగా మాట్లాడుకుంటున్నారని వాపోయింది. అసలు ఆమె ఫోన్ కాల్ సారాంశం వింటుంటే ఎవరికైనా మేకప్ మాటున వుండే దారుణమైన కోణాలు కళ్లకు కడతాయి.
ఒక్క ప్రత్యూష బెనర్జీ కాదు ఎందరో అమ్మాయిలు నటన ముసుగులో వేశ్యలుగా మారాల్సి వస్తోంది రంగుల ప్రపంచంలో. మోడలింగ్ లోనూ అదే పరిస్థితి. ర్యాంప్ పై నడిస్తే వచ్చే దానికన్నా ఎక్కువ రాత్రి తప్పటడుగులు వేస్తే వస్తుంది. అందుకే, కొందరు గ్లామర్ క్వీన్స్ కావాలని పతనమైతే మరికొందరు తెలిసీ తెలియక, ఇతరుల ఒత్తిళ్లతో ఉబిలో కూరుకుపోతున్నారు. ప్రత్యూషలాగా ప్రియుళ్లు, భర్తలు లేదా మరెవరో దగ్గరి బందువుల చేతిలో బందీలుగా నరకం చూసేవారు బోలెడు మంది. తారా చౌదరి కేసు మొదలు శ్వేతా బసు వరకూ అందాల ప్రపంచంలో అందరివీ ఒకేలాంటి నేపథ్యలే. ఆర్దికంగా ఏ స్థితిలో వున్నా సెక్స్ సంబంధమైన విషయాల్లో మాత్రం అత్యధిక శాతం ఆడవాళ్లు బాధితులుగానే మిగిలిపోతున్నారు. అసలు బయటకి పొక్కకుండా లోలోన మగ్గిపోతున్న సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్స్ ఇంకా మరెన్నో!
గ్లామర్ వాల్డ్ లో నిత్యం జరిగే బెడ్ రూం క్రైమ్స్ మ్యాగ్జిమమ్ బయటకు రాకపోవటానికి ప్రధాన కారణం ఇక్కడి బాధితులు కూడా దాన్ని తమ ఫీల్డ్ లో సహజమైందిగా భావించటం. శృంగారంతో ఇచ్చిపుచ్చుకోకపోతే ఆఫర్స్ రావనీ, పస్తులు తప్పవని వాళ్లకీ డీపాల్ట్ గా తెలిసిపోయి వుంటుంది. అందుకే, ఎంత వయోలెంట్ ఎక్స్ పీరియన్స్ అయినా సైలెంట్ గా మనసు పొరల్లో దాచేసుకుని భారంగా ముందుకు పోతుంటారు! ప్రత్యూషకు ఎదురైన అనుభవాలు కొత్తవీ కాదు... ఇప్పుడప్పుడే ఆగిపోయేవి కావు. ఒక గ్లామర్ ప్రపంచంలో ఎందరో ప్రత్యూషలు!