పెళ్లి కూతురు జంప్..తల్లిదండ్రులకు తలవంపు..
posted on Jun 16, 2021 @ 11:56AM
నేటి తరం పిల్లలు చాలా స్పీడ్ ఉన్నారు. అన్నిట్లోనూ ముందు ఉన్నారు. బైక్ తోలడంలోనూ ముందు ఉన్నారు..ప్రాణాలు పోడోట్టుకోవడంలో ముందు ఉన్నారు. ప్రేమించడంలో ఉండు ఉన్నారు.. పెళ్లి చేసుకోవడం లోను ముందు ఉన్నారు. చంపడంలో ఉండు ఉన్నారు చనిపోవడంతో ముందు ఉన్నారు. చివరికి అమ్మానాన్నలను బాధపెట్టడంలో ముందు ఉన్నారు. తాజాగా ఓ యువతి పెళ్ళికి ముందు తన తల్లి దండ్రులకు షాక్ ఇచ్చింది.. కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.. ఆవేదన పాడడం తప్పా.. ఇంతో తెలుసుకుందామా..?
అది చిత్తూరు జిల్లా. చంద్రగిరి మండలం. మిట్టపాళ్యం గ్రామం. ఈ గ్రామానికి చెందిన యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేశారు. మరి ఆ పెళ్లి ఇష్టం లేదో.. లేక ఆ అమ్మాయి ఇంకెవర్ని అయినా లవ్ చేస్తుందో. ఆ విషయం చెప్పితే ఇంట్లో వాలు ఒప్పుకోరనుకుందో.. లేదంటే ఇంకా చదువుకోవాలనుకుంటే తొందరగా పెళ్లి చేస్తున్నారనుకుందో ఏమో గానీ, ఇంకో రెండు రోజుల్లో నిశ్చితార్ధం. ఈమె తల్లి దండ్రులు పెళ్లి పనుల్లో మునిగారు. కానీ పెళ్లి కూతురు కనిపించడం లేదు.. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. కూతురి కోసం అంత వెతికారు కనిపించలేదు. ఆ పెళ్లి కూతురు ఎక్కడికి పోయి ఉంటుంది.. అసలు ఏం జరిగుంటుంది. అని తెలుసుకోవాలనుకుంతున్నారా? మీరే చూడండి.. మీకే తెలుస్తుంది.
మిట్టపాళ్యం గ్రామానికి చెందిన ఎస్.శేఖర్‌రెడ్డి కూతురు తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ.కాం మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఇటీవల కుటుంబ పెద్దలు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసి ఈ నెల 17న నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పరారైంది. ఇంట్లో దాచిన రూ. 4 లక్షల నగదు, 10తులాల బంగారు ఆభరణాలతో పరారైంది. మంగళవారం ఉదయం కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు.
ఇళ్లంతా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీనికితోడు బీరువాలోని నగదు, బంగారం కనిపించకుండా పోవడంతో కూతురే వాటిని తీసుకుని వెళ్లిపోయి ఉండొచ్చని నిర్ధారణకు వచ్చారు. దీంతో వారు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యువతి పెళ్లి ఇష్టం లేక పారిపోయిందా.. లేక ప్రేమ వ్యవహారమేదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.