ఖతర్నాక్ లేడీ.. 22సార్లు కెమెరాలకు చిక్కి...
posted on Jun 16, 2021 @ 11:10AM
అస్లీ హైదరాబాదీ.. టీనేజ్ గర్ల్.. ఫుల్ యాక్టివ్.. పేరెంట్స్ పొజిషన్ ఓకే.. కూతురు అడగ్గానే బండి కొనిచ్చారు.. జిల్ జిల్ జిగా అంటూ.. ఆ లేడీ.. రయ్ రయ్ మంటూ బండిపై చక్కర్లు కొట్టేది. ఉండేది నిజాంపేటలోనైనా.. ఆ చుట్టుపక్కల ఏ ఏరియాలో చూసినా ఆమే కనిపించేది.. ఇలా ఏళ్లుగా బండిపై తిరుగుతూ తిరుగుతూ.. బైక్ రైడింగ్ ఫుల్ పర్‌ఫెక్ట్ అయిపోయింది.. లోకల్‌లో గల్లీలన్నీ తెలిసిపోయాయి.. అసలే ఫ్రెండ్స్ ఎక్కువాయే.. ఎవరు ఫోన్ చేసినా.. ఇంట్లో ఏ పని ఉన్నా.. బండేసి బయటకి రావడమే.. రోడ్డు మీద రిమ్ జిమ్.. రిమ్ జిమ్ అంటూ తిరగడమే....
కట్ చేస్తే.. వన్ ఫైన్ డే.. ఆ బండిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు.. ఇన్నేళ్లుగా బండి నడుపుతున్నా.. ఆమెను పోలీసులు ఆపడం అదే ఫస్ట్ టైమ్.. నా ఏరియాలో నన్నే ఆపుతారా? అన్నట్టు చూసింది వాళ్లవైపు. స్పీడ్ పెంచి ఎక్కేప్ అయిదామనీ ట్రై చేసింది.. కానీ ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా? ఎంత మందిని చూసుంటారు వారు.. ఎంత మందిని పట్టుకుని ఉంటారు.. సో, పోలీసుల నుంచి తప్పించుకోవడం ఆమె వల్ల కాలేదు.. బండి పక్కన పెట్టమన్నారు కాప్స్.. బండి సైడ్‌లో పార్క్ చేసింది ఆ యువతి...
పోలీసుల దగ్గర ఉన్న ట్యాబ్‌లో ఆ యువతి బండి నెంబర్ ఎంటర్ చేశారు.. అంతే షాక్.. ఆ ట్యాబ్‌ను ఆమెకు కూడా చూపించారు.. ఆమె కూడా షాక్.. ఇంతకీ, అంతమంది షాక్ తిన్న విషయం ఏంటంటే.. ఆమె బండి నెంబర్ మీద.. ఆమె ఫోటోలతో సహా.. ఏకంగా 22 చలాన్లు ఉన్నాయి.. ఒకటా, రెండా.. ఓ యువతి 22 సార్లు రూల్స్ బ్రేక్ చేయడం చూసి ట్రాఫిక్ పోలీసులే అవాక్కయ్యారు.. ఖతర్నాక్ కేండిడేట్‌గా ఉందే అంటూ ఆశ్చర్యపోయారు..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ, ఒంటి చేత్తో బండి నడుపుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసి.. వారెవా, సింగిల్ హ్యాండ్‌తో యమ స్పీడ్‌గా భలే నడుపుతుందే బండి అనిపించక మానదు.. ఎంతైనా హైదరాబాద్ అమ్మాయా మజాకా... సోల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్.. ఇలా మొత్తం 22 చలాన్లు.. 9,070 రూపాయల ఫైన్..
వామ్మో ఈ కేసు మహా ముదురు అనుకున్నారు కూకట్‌పల్లి పోలీసులు. వెంటనే బండి స్టేషన్లో పెట్టి.. ఆ యువతి పేరెంట్స్‌ను పిలిపించారు. వాళ్ల కూతురు బండి యవ్వారంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. 9,070 ఫైన్ కట్టించుకొని.. వార్నింగ్ ఇచ్చి పంపించారు. పేరెంట్స్ సైతం చాలా ప్రాక్టికల్‌గా ఉన్నట్టున్నారు.. తిరిగితే తిరుగు కానీ.. ట్రాఫిక్ పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగు అంటూ కూతురుకు సలహా ఇచ్చారు. ఎందుకైనా మంచిది.. ఏ సందులోనో ట్రాఫికోళ్లు కాపు కాసి ఫోటోలు తీసి ఫైన్లు వేస్తారు.. ఈసారి నుంచి హెల్మెట్ తప్పకుండా పెట్టుకో.. జుట్టు కరాబు ఐతదని మానేయకంటూ కూతుర్ని కాస్త మందలించారు.. 9వేలు ఫైన్ కట్టాల్సి వచ్చిందనే బాధే కానీ, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ లాంటి వేమీ వాళ్ల తలకు ఎక్కినట్టు అనిపించలేదు.. ఎంతైనా హైదరాబాదీస్ కదా... అలానే ఉంటారు మరి.....