భూములపై ఎలాంటి అనుమానాలు వద్దు
posted on Mar 30, 2011 @ 10:08AM
హైదరాబాద్: భూకేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పారదర్శకంగా ఉంటున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం మంచి మంచి పథకాలు తీసుకు వచ్చారని అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలనే ఉద్దేశ్యంలో భాగంగా వైయస్ మానుఫాక్చరింగ్ సెక్టర్‌కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైయస్ బాటలోనే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళుతున్నారన్నారు. కాగా ఐటి అభివృద్ధిలో, సెజ్‌ల గురించి చంద్రబాబు ప్రయత్నాలకు ఆమె కితాబు ఇచ్చారు. వారు చేసింది అభివృద్ధని, మేం చేసింది అభివృద్ధి కాదన్నట్టు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్నారు. ఎమ్మార్ విషయంలో గత ప్రభుత్వం కంటే కాంగ్రెసు ప్రభుత్వం మెరుగుగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రం ప్రయోజనాలకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైన చిత్తశుద్ధితో ఉందన్నారు. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. సెజ్‌లకు కేటాయించిన భూములపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.