రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లకు జాక్ పాట్
posted on Oct 9, 2012 @ 6:35PM
వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గట్టిగా అమలౌతోంది. దీన్ని గాడిలో పెట్టేందుకు గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లు పాస్ బుక్ ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికొచ్చినబాయ్.. పాస్ బుక్ ఉంటేనే డెలివరీ ఇస్తున్నాడు. పాస్ బుక్ సమయానికి కనిపించకపోయినా, లేకపోయినా సిలిండర్ ఇవ్వడానికొచ్చిన కుర్రాడికి మరో యాభై రూపాయలు అదనంగా సమర్పించుకోక తప్పనిపరిస్థితి. గ్యాస్ బుక్ లేనివాళ్లకు, అందుబాటులో లేనివాళ్లకు అదనపు వాయింపు తప్పనిసరయ్యింది. అప్పటికప్పుడు కొత్త పాస్ బుక్ ఇష్యూచేసే సదుపాయాన్ని రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలు, అందరు డీలర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. పాస్ బుక్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లేదు అనే నినాదాన్ని విస్తృతంగా, స్వచ్ఛందంగా ప్రచారం చేసుకుంటున్నారుకూడా.. గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సమయంలో ఇచ్చిన పత్రాల్ని చూపిస్తేచాలు కొత్త పాస్ బుక్ ఇచ్చేసినట్టే..