వైసీపీతో అనుబంధ సంఘాల బంధం పుటుక్కుమందా?
posted on Jun 17, 2023 @ 10:48AM
వచ్చే ఎన్నికలలో వైసీపీకి అధికారం, జగన్ మరో సారి ముఖ్యమంత్రి అంటే జనం రియాక్షన్ ఎలా ఉందన్నది పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ అయితే మాత్రం పెద్ద ఉత్సాహం చూపడంలేదు. నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రానికి, ప్రజలకే కాదు.. పార్టీ కోసం సర్వం ఒడ్డి పని చేసిన తమను కూడా పట్టించుకోలేదన్న ఆగ్రహం వారిలో వ్యక్తం అవుతోంది.
పార్టీ అనుబంధ సమావేశాల పేరిట వైసీపీ ఎంపీ విజయసాయి ఇటీవలి కాలంలో వరుసగా నిర్వహిస్తున్న సమావేశాలకు వస్తున్న స్పందనే అందుకు తార్కానం. నాలుగేళ్లుగా ఉన్నామా? చచ్చామా పట్టించుకోని పార్టీ హై కమాండ్ మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే మేం గుర్తుకొచ్చామా అని వైసీపీ శ్రేణులు అంతర్గతంగా రగిలిపోతున్నాయి. ఆ ఎఫెక్ట్ విజయసాయి నిర్వహిస్తున్న పార్టీ అనుబంధ సంఘాల సమావేశాల్లో ప్రస్ఫుటమౌతోంది. గత కొంత కాలంగా పార్టీలో తన ఉనికే ప్రశ్నార్ధకంగా మారిన విజయసాయి.. ఇప్పుడు ఏదో బాధ్యత అప్పగించారని నిర్వహిస్తున్న అనుబంధ సంఘాల సమావేశాలలో ఆయన ప్రసంగాలు కూడా మొక్కుబడిగానే సాగుతున్నాయి. నాలుగేళ్లలో పార్టీ సాధించిన ఘనతల గురించి చెప్పకుండానే.. జగన్ మరో సారి ముఖ్యమంత్రి కావాలనీ, ఇందుకు అందరూ కష్టించి పని చేయాలని మాత్రమే చెప్పి మమ అనిపిస్తున్నారు.
ఆయన ఎంత మొక్కుబడిగా సమావేశాలను నిర్వహిస్తున్నారో..అంతే మొక్కుబడిగా వచ్చిన వారు కూడా వచ్చామా, చెప్పింది విన్నామా, వెళ్లిపోయామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో గత ఎన్నికల ముందు ఎంతో క్రియాశీలంగా ఉన్న అనుబంధ సంఘాలు ఇప్పుడు అంతే నిర్వీర్యంగా మారిపోయాయి. పార్టీకి క్యాడరే అవసరం లేదు.. వాలంటీర్ల వ్యవస్థ ఒక్కటి చాలు అన్నట్లుగా.. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని బాధ్యతలూ (పార్టీ, ప్రభుత్వ) అప్పగించేసి నాలుగేళ్ల పాటు క్యాడర్ ను పట్టించుకోని పార్టీ అధినేత.. ఇప్పుడు ఎన్నికల ముందు వారిని కలిసేందుకు ముఖం చెల్లక చెల్లని కాణీలా ఇంత కాలం పక్కన పెట్టేసిన విజయసాయికి ఆ బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయాలని ఆదేశించడంతో ఈ పరిస్థితి ఎదురైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అనుబంధ సంఘాల సమావేశాలనైతే విజయసాయి నిర్వహిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని వారికి ఉపదేశాలు, ఉపన్యాసాలూ ఇస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఆయన గత ఎన్నికల ముందు క్యాడర్ కు చేసిన ఉపదేశాలకూ, ఇప్పుడు చేస్తున్న ఉద్బోధలకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని క్యాడరే చెబుతున్నారు. ఏదో రాసుకొచ్చిన ప్రసంగం గడగడ చదివేసినట్లుగా విజయసాయి తీరు ఉంటే.. హమ్మయ్య ఆయన ప్రసంగం అయిపోయిందన్నట్లుగా సమావేశానికి హాజరైన వారి తీరు ఉందని అంటున్నారు.
అనుబంధ సంఘాల నేతలెవరూ ఇప్పడు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా లేరు. గత ఎన్నికలలో సర్వం ఒడ్డి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తమకు ఏం ఒరిగిందని వారు రగిలిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తించినందునే అందుకే విజయసాయి పార్టీ కోసం పని చేయాలని అని చెప్పగలుగుతున్నారే కానీ, పార్టీ కోసం పని చేస్తే జరిగే మేలు గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇప్పటికే సమాజిక మాధ్యమంలో గతంలో ఎంతో చురుకుగా ఉన్న విజయసాయి ఇప్పుడు దాదాపుగా దానికి దూరం అయ్యారు.
ఒక వేళ అడపాదడపా ఏదైనా పోస్టు చేసినా.. అది పార్టీ గురించి కానీ, విపక్షాలపై విమర్శల గురించి కానీ కాకుండా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి, కేంద్రంలోని మోడీ సర్కార్ ఘనతలను ప్రశంసించడానికే పరిమితం చేస్తున్నారు. అటువంటి విజయసాయి.. విపక్షాల విమర్శలను గట్టిగా ఖండించాలనీ, ప్రభుత్వ ఘనతలను ప్రజలకు వివరించాలని అనుబంధ సంఘాల నేతలకు ఎలా చెప్పగలుగుతారని పరిశీలకులు అంటున్నారు. అందుకే విజయసాయి సమావేశాలకు ఎటువంటి స్పందనా రావడం లేదనీ, పైపెచ్చు ఈ సమావేశాలతో వైసీసీ క్యాడర్ కు పార్టీకి మధ్య ఏర్పడిన అఘాధం జనానికి కూడా తెలిసిపోయేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప