మరో గ్యాంగ్ రే-ప్.. యువతికి మద్యం తాగించి.. హాస్పిటల్‌లో అత్యా-చారం
posted on Sep 29, 2021 @ 10:32AM
దిశను నలుగురు మృగాలు క్రూరంగా చెరిచారు. రోజంతా కాపు కాసి.. బరితెగించి బలాత్కారం చేసి.. దారుణంగా పెట్రోల్ పోసి చంపేశారు. ఆ మానవ మృగాలపై దేశమంతా కన్నెర్ర చేసింది. తెలంగాణ పోలీసులు ఆ ఉన్మాదులను కాల్చి పారేశారు. ఆ ఎన్‌కౌంటర్‌తో అలాంటి ఆలోచన చేసే శాడిస్టుల్లో భయం పుడుతుందని అనుకున్నారు. ఇకపై అత్యా-చారం అనే ఆలోచన వస్తేనే వణికిపోతారని భావించారు. కానీ, అలా జరగడం లేదు. దిశ ఎన్‌కౌంటర్ ఉన్మాదులను కట్టడి చేయలేకపోతోంది. ఆ తర్వాత కూడా పలు రే-ప్ ఘటనలు జరగడం కలవరం కలిగిస్తోంది. ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిని చెరిచాడు ఓ దుర్మార్గుడు. పోలీసుల చక్రబంధనంతో ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఇక దిశ ఎన్‌కౌంటర్ కేసులో త్రిసభ్య కమిటీ ఆనాటి సీపీ సజ్జన్నార్‌ను ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే నిజామాబాద్‌లో మరో దిశ తరహా సామూహిక అత్యా-చార ఘటన జరగడం కలకలం రేపుతోంది.
నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై గ్యాంగ్ రే-ప్‌కు పాల్పడ్డారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. యువతికి మద్యం తాగించి నలుగురు ఉన్మాదులు ఈ దారుణానికి తెగించారు. గమనించిన హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చే సరికి ఆ నలుగురు దుర్మార్గులు అక్కడి నుంచి పారిపోయారు.
మద్యం మత్తులో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిజామాబాద్‌లో గ్యాంగ్ రే-ప్ జరిగిందని తెలిసి తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మానవ మృగాల దారుణాలకు అంతెప్పుడని ప్రశ్నిస్తున్నాయి.