posted on Aug 9, 2012 @ 2:55PM
గాలి బెయిల్ స్కామ్ కేసులో నిందుతులైన పట్టాభిరామారావు, చలపతిరావు, రౌడీ షీటర్ యాదగిరి, రవిచంద్ర ల రిమాండ్ ను ఈనెల 17 వరకు, అలాగే రావి సూర్యప్రకాష్ రావు, లక్ష్మీనరసింహారావు, ప్రభాకరరావు రిమాండ్ లను సిబీఐ కోర్టు ఈనెల 14 వరకు పొడిగించింది.
ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు. తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారబోతున్నానంటూ సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బీజేపీలోనే ఉన్నాననీ, ఉంటాననీ పేర్కొన్న ఆయన క్యాడర్ లో అయోమయం సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ నుఎత్తివేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ ఎత్తివేతపై చర్చ జరగుతోందనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. సస్పెన్షన్ ఉపసంహరణ సభలో తాను కూడా పాల్గొంటానని కిషన్ రెడ్డి అన్నారు. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రే పిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హై కమాండ్ రాజాసింగ్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేసింది.
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను నిన్న దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన చీకోటి, థాయ్‌లాండ్‌కు ఆటగాడిగానే వెళ్లాననీ, ఆర్గనైజర్ గా కాదని పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నా ఎప్పుడు పిలిచినా ఈడీ విచారణకు వెళతానని స్పష్టం చేశారు.
. పలువురు గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు సంఘటనా స్థలంలోనే కాల్చి చంపారు. కాగా దుండగురి కాల్పులలో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజలుగా పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ముఖ్యంగా ఏపీలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ హీట్ వేవ్ మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో వడదెబ్బకు నిన్న ఒక్క రోజే నలుగురు మరణించారు. నెల్లూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో అయిన వాళ్లే కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఒంగోలు వాసులకే తాను జవాబుదారిగా ఉంటానని అన్నారు.
రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మార్కాపురం తెలుగుదేశం ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద బోల్తా పడింది. ఈ సంఘటనతో తీవ్రంగా గాయపడిన కందుల నారాయణ రెడ్డిని యర్రగొండపాలెంలోని ఓ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
కర్ణాటకలో సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్ననే హస్తిన చేరుకోగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కర్నాటక ముఖ్యమంత్రి పదవిని చెరో రెండేళ్లు పంచుకోవాలన్న ప్రతిపాదనను తాను తిరస్కరించినట్ల చెప్పిన డీకే శివకుమార్ ఇదేమీ ఆస్తుల పంపకం లాంటిది కాదన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానని స్పష్టం చేశారు.