ఒక్క అమ్మాయిని ఇద్దరు ఇష్టపడ్డారు.. చివరికి కత్తి తో పొడుచుకున్నారు..
posted on Jun 1, 2021 @ 4:33PM
చిన్నదో వైపు పెద్దదో వైపు.. సాంగ్ వినే ఉంటారు, నారి నారి నడుమ మురారి సినిమా కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఆ రెండింటికి బిన్నంగా ఉంటుంది. ఈ కథలో హీరోలు ఇద్దరు, హీరోయిన్ ఒక్కరు. చివరికి ఏం జరిగిందో మీరో తెలుసుకోండి..
ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పరిధి వట్టేపల్లి గ్రామం.. వారిద్దరి పేర్లు ఉమార్, మెయిన్, ఆ ఇద్దరు దోస్తు మేర దోస్త్ తుహే మేరె జాన్.. ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తే ఇద్దరు కలిసే ఉంటారు. చివరికి అక్కడే చిక్కు వచ్చింది. ఆ చిక్కు ఏంటని అనుకుంటున్నారా.. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఇద్దరు ఇష్టపడ్డారు. ప్రేమ ఎలాంటి పని అయినా చేయిస్తోంది అన్నట్లు.. హీరోని విలన్ ని చేస్తుంది.. విలన్ ని హీరో గా చేస్తుంది. ఫ్రెండ్స్ ని బద్ద శత్రువుల్ని చేస్తుంది. అవసరం అంటే చపడానికైనా.. చనిపోవడానికైనా తెగిపజేస్తుంది. ఇంకేముంది తాను ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి రావద్దంటూ ఉమర్ పై కత్తితో మొయిన్ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన మొయిన్ పథకం ప్రకారం ఇంట్లో నుండి తీసుకొచ్చిన కత్తితో ఉమర్ పై దాడి చేశాడు. ఉమర్ కుడి భుజం పై కత్తిపోట్లు పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది.దాడి అనంతరం మొయిన్ అక్కడి నుండి పారిపోయాడు. హుటాహుటిన స్థానికులు ఉమర్ ను ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మొయిన్ పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.