బతికుండగానే చంపేశారు.. బీమా కాజేశారు
posted on Jul 23, 2021 @ 3:46PM
డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కొంత మంది అధికారులు అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ నోకేస్తున్నారు. చివరికి వారికి దేశానికి అన్నం పెట్టె రైతన్నలు కూడా బలవుతున్నారు. రైతులు అకాల మరణం తో చనిపోయిన వారి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం లో ఎక్కడ లేని విధంగా రైతు భీమా పథకాన్ని తీసుతుకువచ్చారు. ఆ డబ్బుల కోసం కొంత మంది అధికారులు గోతికాది నక్కలా ఎదురుచూస్తున్నారు. బతికి ఉన్న రైతు పేరిట రైతుభీమా మంజూరైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసి సంచలనంగా మారింది. చివరికి ఇలా కూడా అధికారులు మోసాలకు పాలుపడుతున్నారు. చనిపోయాక వచ్చే డబ్బుల కోసం చివరికి ప్రతికి ఉన్న మనుషులను చనిపోయారని పత్రాలు ద్రువీకరిస్తున్నారు. తాజాగా వికారాబాద్ లో బీమా కోసం జరిగిన ఓ ఘరానా మోసం వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. అయితే తాజాగా ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఆమెను చంపేశారు అంటే.. రైతు భీమా పథకం కింద వచ్చే ఐదు లక్షలు కోసం. మృతిచెందిన రైతుల కుటుంబానికి సహాయపడడానికి ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొంతమంది అధికారులు చంద్రమ్మ బతికుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు భీమాకు దరఖాస్తు చేశారు. బీమా సొమ్ము కోసం మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఈ ఘటన కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పుట్టాపహాడ్‌కు చెందిన చంద్రమ్మ (58) చనిపోయినట్లు ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆమె పేరున వచ్చిన రూ.5లక్షల బీమా సొమ్మును రైతుబంధు సమన్వయకర్త రాఘవేందర్‌రెడ్డి కాజేశారు. తమకు రైతుబంధు రావడం లేదంటూ చంద్రమ్మ కుమారుడు బాలయ్య అధికారులను కలవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
చంద్రమ్మ కుమారుడు బాలయ్యకు మాయమాటలు చెప్పి ఐదు లక్షలు కాజేశారు. తల్లి రైతుబంధు పడడం లేదని వ్యవసాయ అధికారులను బాలయ్య ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. మీ అమ్మ చనిపోయింది.. అందుకుగాను ఐదు లక్షల రైతు భీమా నీ అకౌంట్లో పడిందన్న వ్యవసాయ అధికారుల మాటలకు షాక్ అయిన కొడుకు, తన తల్లి బతికేవుందని తెలపడంతో వీరి గుట్టురట్టు అయ్యింది. ఈ ఘటనపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.