మేకపై ఐదుగురు అత్యాచారం.. ప్రధానిపై జనం ఫైర్..
posted on Jul 30, 2021 @ 11:17AM
ఈ ప్రపంచంలో అది పెద్ద జంతువు. మనిషి.. ఎందుకంటే.. ఎలుకని పిల్లి చంపితే పిల్లిని కుక్క చంపుతుంది.. కుక్కను మరోటి చంపుతుంది.. పులిని సింహం చంపుతుంది.. కానీ అన్నింటిని చంపుకు తినేవాడు మనిషి ఒక్కడే.. అందుకే మనిషిని మించిన జంతువు మరొకటి లేదు ఈ ప్రపంచంలో కామం పెరిగినప్పుడు జంతువులు చాలా వైల్డ్ గా స్పందిస్తాయి.. మనిషి వాటికంటే వైల్డ్ గా స్పందిస్తాడు.. కామం అనే పురుగు మెదడులో తిరిగితే ఎంతకైనా తెగిస్తాడు మనిషి.. తాజాగా ఒక ఘోరం జరిగింది.. అదేంటో తెలుసుకుందాం..?
కామాంధులు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. చిన్న పెద్ద ఆడామగ తేడాలేకుండా ప్రవర్తించే ఈ కామాంధులు తాజాగా రూట్ మార్చారు. మనుషులపైనే కాకుండా మూగజీవాలపై కూడా వారి లైంగికవాంఛ తీర్చుకుంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు యువకులు ఓ మేకను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండ ఆ మేకను చంపేంసి పరారయ్యారు.. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మేకపై లైంగిక దాడికి పాల్పడి చంపేసినట్లు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అదేంటి పాకిస్తాన్ ప్రధానికి ఏం సంబంధం అనుకుంటున్నారా..? ఈ సంఘటన జరిగింది అక్కడే కాబట్టి. ఇటీవల ఓ అత్యాచార ఘటనపై స్పందించిన ఇమ్రాన్.. మహిళల వస్త్రధారణ కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇమ్రాన్ మాటలపై అయన మాజీ భార్య సైతం అగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ మేక ఏ విధంగా కామాంధులను రెచ్చగెట్టింది అంటూ ఇమ్రాన్ ను నిలదీస్తున్నారు.