Read more!

ఉదయం లేవగానే మెంతుల నీళ్లు తాగుతే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు..!

మెంతుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్, మాంగనీస్‌తో సహా మంచి మొత్తంలో ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, రాత్రిపూట ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో మెంతులు వేసి నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. కావాలంటే మెంతి గింజలు కూడా తినొచ్చు. దీంతో శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది:
 ఖాళీ కడుపుతో మెంతుల గింజల నీరు తాగితే  షుగర్ అదుపులో ఉంటుంది. మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే మెంతి గింజల నీటిని తాగవచ్చు.

గుండెకు మేలు చేస్తుంది:
మెంతి నీరు గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించే హైపోకొలెస్టెరోలెమిక్ మూలకాలను కలిగి ఉంటుంది.  తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వినియోగం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు రోజూ మెంతి నీటిని కూడా తీసుకోవచ్చు.

బరువు తగ్గుతుంది:
మెంతి గింజల్లో ఫైబర్ ఉంటుంది.  ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతుల నీళ్లు  తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది:
మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అజీర్ణం లేదా మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారికి మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:
 మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగుతే, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్యను నయం చేయవచ్చు. మెంతి గింజల నీటిని ఒక నెలపాటు క్రమం తప్పకుండా తాగితే, హెచ్‌డిఎల్ అంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తున్నారు.