కన్న కూతురికి నిప్పు.. ఎందుకో తెలుసా?
posted on Jun 16, 2021 @ 10:10AM
నవమాసాలు మోశారు. జన్మనిచ్చారు. పెంచి పెద్దగా చేశారు. చివరికి అదే కూతురి ప్రాణం తీశారు. ప్రేమకి మారు పేరు అమ్మనాన్న అని అంటారు అదే ప్రేమకు కూతురు ఇంకొకరితో పంచుకుంటే తట్టుకోలేకపోయారు. ఒక్క సారిగా ఆకలి తీర్చని పరువు గురించి ఆలోచించారు. డబ్బులు ఇస్తేగాని ఓటు వేయని సమాజంలో, తన ఇంటి గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేసి పక్కోడి ఇంటి పై కన్ను వేసే ఈ సమాజంలో లో బతుకుతూ కూడా చివరికి కన్నా కూతురు ఆమె ప్రేమ బరువై ఆ ఆ తల్లిదండ్రులు కన్నా కూతుర్నే కడతేర్చారు.
అది కడప జిల్లా. రాయచోటి. ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ఓ యువకుడిని ప్రేమించిందన్న కోపంతో పాటు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాయచోటి సీఐ జి.రాజు కథనం మేరకు. సదరు యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. ఈ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ ఆమె చెడగొడుతోంది. దీంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులతో ఆమెకు గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అమ్మానాన్నలు అంతే పిల్లల బలాన్ని ఇష్టపడమే కాదు. పిల్లల బలహీనతలను కూడా ఇష్టపడాలి. కష్టాల్లోనూ తోడు ఉండాలి.. ప్రేమించిన వాడికి పెళ్లి చేస్తే ఆ తర్వాతే మేము చూసుకుంటాం కదా మా జీవితం ఏంటో అని పిల్లలు అనుకుంటారు.. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి మనసు మరి మా అమ్మాయిని వదిలేస్తే అప్పుడు మా అమ్మాయి జీవితం నాశనం అవుతాడని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇద్దరి ఆలోచనలో తప్పులేదు.