20 ఏళ్ళ జైలు జీవితం తర్వాత నిర్దోషి..
posted on Mar 4, 2021 @ 10:16AM
తప్పులు అందరు చేస్తారు. కొందరు తప్పులు చేసి తప్పించుకుంటారు. మరికొందరు దొరికిపోతారు. అదే చేయనని నేరానికి శిక్ష పడితే. కుటుంబం దిక్కులేనిది అవుతుంది. పిల్లను దిక్కులేని వాళ్ళు అవుతారు..అయినా.. ఇలాంటివి సినిమాల్లో కదా జరిగేది అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే. అతడు 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. అర్థ ఆయుష్షు ఉన్నపుడు అయ్యాడు. అతను బతికి ఉన్నాడు అనే విషయం తన కుటుంబం కూడా మరిచిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ గ్రామానికి చెందిన విష్ణు తివారీ 23 సంవత్సరాల వయసులో ఓ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 20 ఏళ్ళు జైలు లో ఉన్నాడు. 43 వ ఏట జైలు నుండి విడుదల అయ్యాడు. మూడేళ్లు జైల్లో మగ్గిన తర్వాత.. కోర్టు దోషిగా తేల్చి 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు సా..గుతూ వచ్చింది. అంతలోనే ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ఈ జనవరిలో అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. అతడు బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లో సగం జీవితం గడిపాడు.
ప్రస్తుత వయసు 43 ఏళ్లు. విడుదల అవుతున్న క్షణంలో అతడి కళ్లలో నైరాశ్యం, దేహంలో నీరసం. జైలు నుంచి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చి నేనేం చేయగలను. జైల్లోనే నా ఒళ్లు హూనమైపోయింది. నా కుటుంబం కూడా నాశనమైపోయింది. ఓ సోదరుడు మినహా.. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితం జైల్లో వంట గదికే పరిమితమైపోయింది. ఈ రోజు విడుదలయ్యే నాటికి నా చేతిలో రూ. 600 మాత్రమే ఉంది’’ అంటూ వాపోయాడు. ఎక్కడో జరిగిన తప్పునకు సగం జీవితంతో పాటు.. కుటుంబాన్ని కోల్పోయి.. ఒంటరిగా మిగిలిపోయాడు విష్ణు తివారీ.