కర్నూల్ లో టీడీపీ నేతలను చంపింది వీళ్ళే..
posted on Jun 17, 2021 @ 12:43PM
రాయలసీమ ఆ పేరు వింటే చాలు. ఫ్యాక్షన్ గుర్తుకు వస్తుంది. వారికి దూకుడు ఎక్కువ.. వారి కత్తికి పదునెక్కువ. మొత్తానికి వాళ్లకు మూర్ఖత్వం ఎక్కువ. కానీ చాలా మంది రాజకీయ బలిపశువులు అవుతున్నారు. అధికారం సాగించేందుకు అవసరమైతే తలకాయలు తెగాల్సిందే.. తలకాయాలు అంతే ఏ మొక్కవో గొఱ్ఱెవో కాదు మనుషుల మెడకాయలు. అదేదో సినిమాలో చూపినట్టు "సమరసింహా దొరబాబు సల్లంగుండాలే.. మీరు హాయిగుండాలే.. భరత సింహారెడ్డి.. మీరు బాంబులెయ్యలే మేమంతా బాటపట్టాలే.. మీనెత్తి మీద గొడుగులం .. మీ కళ్లకింద చెప్పుళం. .మీ చేతిలోని కత్తులం.. మీరు ఉసుకో ఉసుకో ఉసుకో అంతే ఊరికే వేట కుక్కలా అన్నట్లు" కొంత మంది ప్రయోజనాల కోసం ఈ ఫ్యాక్షన్ ని పెట్టి పోషిస్తుంటారు.. ఆ విషయం అందరికి తెలిసిందే.. ఇక రాయలసీమ వాళ్లకు చంపడం, చావడం, వాళ్లకి కొత్త ఏం కాదు. వాళ్ళు కక్ష కడితే సొంత సొంత అన్న తమ్ముడు అని చూడరు. వెయ్యాలనుకుంటే వేసేస్తారు అదే వాళ్ళకి తెలిసిన పని కొంత కాలంగా ప్రశాంతగా ఉన్న రాయలసీమలో ఫ్యాక్షన్ మళ్లీ ఊపు అందుకుంది. కత్తులు దుస్తున్నారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. అవసరం అయితే ఖతం చేస్తున్నారు. తాజగా కర్నూల్ జిల్లాలో ప్రత్యర్థుల దాడితో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోమారు. మరణించిన వారిద్దరు సొంత అన్నదమ్ములే. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు.
కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేతలైన అన్నదమ్ములను వెంటాడిన ప్రత్యర్థులు కత్తులతో వేటాడారు, జంతువుల వెంటాడి విచక్షణా రహితంగా నరికి చంపేశారు. అందరికి ఆ సత్యాలను చూసే అవకాశం దక్కపోవచ్చు కానీ మన వర్మ సినిమాలో చూసినట్లే ఉండొచ్చు ఆ హత్యలు. అడ్డొచ్చిన వారి అనుచరులపైనా దాడి చేశారు. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పెసరవాయి గ్రామానికి చెందిన వడ్డు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి సొంత అన్నదమ్ములు. వీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం అనుచరులతో కలిసి వెళ్తున్న వారిపై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి అక్కడికక్కడే చనిపోగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వీరి హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.